రేటు పెంచిన ‘ఛలో’బ్యూటీ..

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని చూస్తున్నారు. తమ కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నసమయంలో రెమ్యూనరేషన్ పెంచుకొని డబ్బు వెనకేసుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే హీరోయిన్లది ఎప్పటిప్పుడు మారిపోయే ట్రెండ్..కొత్త హీరోయిన్లు వస్తుంటే పాతవారిని పక్కన బెడుతుంటారు. ఈ నేపథ్యంలో ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన రష్మిక మందన తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘గీతాగోవిందం’మూవీలో నటించింది.

ఈ మూవీసూపర్ హిట్ కావడంతో వరుస ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషట్లో నటిస్తుంది. తాజాగా తన రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచేసింద సమాచారం. ‘గీత గోవిందం’ సినిమాకు రూ. 60 లక్షలు తీసుకున్న రష్మిక… కన్నడలో చేసిన ఓ చిత్రానికి రూ. 64 లక్షలు తీసుకుంది.

ఇప్పుడు మహేశ్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’మూవీలో ఆమె నటిస్తోంది. ఈ సినిమాకు ఆమె రూ. కోటి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన ‘డీయర్ కామ్రెడ్ ’ 26న విడుదల కానుంది. మరి ఈ మూవీ గనక హిట్ అయితే రష్మకు కొంత కాలం వరకు టాలీవుడ్ లో ఎదురే ఉండదని అంటున్నారు.

Leave a comment