రాశి ఖన్నా మీద మనసు పడ్డ అల్లు హీరో..!

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటుంది. యువ హీరోలనే కాదు స్టార్ సినిమాలను కూడా చేస్తూ అలరిస్తున్న ఈ అమ్మడు ఈమధ్య సన్నబడి మరి ఎట్రాక్ట్ చేస్తుంది. జై లవ కుశ, తొలిప్రేమ సినిమాల తర్వాత రాశి ఖన్నాకు మరిన్ని అవకాశాలు వస్తాయని అనుకోగా కాస్త వెనక్కి తగ్గింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆమెకు స్టార్ ఛాన్సులు వస్తున్నాయి.

అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఐకాన్ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. వేణు శ్రీరాం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. సినిమాలో బన్ని డ్యుయల్ రోల్ చేస్తున్నాడట. మరి ఒక హీరోయిన్ గా రాశి ఖన్నా సెలెక్ట్ అవగా సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

ఆ సినిమాలో బన్ని సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అలకనంద, నాన్న నేను టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ బ్యానర్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతుంది. 2020 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు.

Leave a comment