అందుకే బూతులు.. రామ్ షాకింగ్ రివీల్!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి సక్సె్స్ ట్రాక్ ఎక్కేందుకు చాలా మంది చూస్తున్నారు. ఒక్క హీరో రామ్ మాత్రమే కాకుండా ఈ సినిమాపై దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మీ, హీరోయిన్ నిధి అగర్వాల్ చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్లలో హీరో రామ్ మాస్ అవతార్ ఆడియెన్స్‌కు పిచ్చపిచ్చగా నచ్చింది. కాగా ఈ సినిమాలో రామ్ చెప్పిన కొన్ని బూతు డైలాగులు కొన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చలేదు.

కాగా టీజర్, ట్రైలర్‌లలోనే ఇన్ని బూతులు ఉంటే.. సినిమాలో ఎన్ని ఉంటాయో అని ఆడియెన్స్ అభిప్రాయ పడుతున్నారు. అయితే సినిమాలో బూతుల గురించి హీరో రామ్ క్లారిటీ ఇచ్చాడు. సినిమాలో ఉన్న ఇస్మార్ట్ శంకర్ పాత్రను ఆధారం చేసుకునే కొన్ని బూతులు ఉన్నాయని.. వాటిని ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోవద్దని అన్నారు. మాస్ సినిమాలు ఆదరించే వారికి ఈ సినిమా పండగలా అనిపిస్తోంది. అయితే క్లాస్ సినిమాల ఆడియెన్స్‌కు అంతగా ఎక్కకపోవచ్చు అని అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.

ఏదేమైనా ఈ నెలలో రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుంటుందో…? చిత్ర యూనిట్‌ను చివరకు ఏం చేస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే అంటున్నారు సినీ వర్గాలు.

Leave a comment