రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. ఇప్పటికే అందరి హీరోలతో నటించిన రకుల్ తొలిసారి సీనియర్ హీరో నాగార్జున సరసన మన్మథుడు 2 సినిమాలో నటిస్తోంది. ఇప్పటిదాకా ఆమె కెరీర్లో ఎప్పుడూ ఒలకపోయినంత గ్లామర్ కూడా ఈ సినిమాలో చూపిస్తోందని స్టిల్స్, టీజర్, ట్రైలర్లు చెప్పేశాయి. మన్మథుడు 2 సినిమాలో రకుల్ అందాలు మామూలుగా చూపించటం లేదు మరి.
ఈ రేంజ్ లో గ్లామర్ ఒలకబోసిన ఆమెకు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ? కోటి 55 లక్షలు మన్మథుడు 2 సినిమాకు గాను రకుల్ కు ముట్టిందట. ఈ సినిమాలో హీరో నాగార్జున తర్వాత హైయెస్ట్ రెమ్యూనరేషన్ రకుల్దే కావటం విశేషం. వాస్తవంగా చూస్తే గత కొద్ది రోజులుగా రకుల్ కు అంత డిమాండ్ ఏమీ లేదు. తెలుగులోనూ ఆమెకు సినిమాలు లేవు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ స్టార్ హీరోయిన్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నా సక్సెస్ అవడం లేదు.
రకుల్ ఫేస్ హిందీ జనాలకు తెలిసింది కావడంతో మన్మథుడు 2 సినిమాను హిందీ డబ్బింగ్… హిందీ శాటిలైట్ మంచి రేటుకు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ రేటు మేకర్స్ కు ఇక్కడ గిట్టుబాటు అయిందట. ఏదేమైనా తెలుగులో అవకాశాలు తగ్గిపోయిన టైం లో రకుల్ కు నాగార్జున సరసన ఛాన్స్ రావడంతో పాటు భారీ రెమ్యూనరేషన్ పట్టేయడం లక్కే అనుకోవాలి.