‘ సైకో స‌య్యాన్ ‘ సాంగ్‌లో ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధా డ్యాన్స్ చూస్తే ఫ్యూజులు ఎగ‌రాల్సిందే (వీడియో)

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఎప్పుడొస్తుందా ? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్‌ను ఆనందపరిచేందుకు చిత్ర యూనిట్ ఫొటోలు, టీజర్ రిలీజ్ చేసింది. సాహో టీజ‌ర్‌కు దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. తొలి సాంగ్ టీజర్ రిలీజ్ చేసిన సాహో టీం ఇప్పుడు ఫుల్ సాంగ్ కూడా రిలీజ్ చేసింది.

సైకో సయ్యాన్ అనే ప‌ల్లవితో సాగిన ఈ పాట‌లో ప్ర‌భాస్ సాంగ్ అంతా హ్యాండ్సమ్ లుక్‌లో కనిపించాడు. హీరోయిన్‌గా నటిస్తున్న శ్రద్దా కపూర్ డ్యాన్సులతో అదరగొట్టింది. 2.11 నిమిషాల పాటు ఉన్న ఈ సాంగ్ మ్యూజిక్ కంపోజింగ్‌, సెట్టింగ్‌, ప్రభాస్‌, శ్ర‌ద్ధ డ్యాన్సులు అన్ని బాలీవుడ్ సినిమాల స్టైల్లోనే ఉన్నాయి. సాంగ్ వింటుంటే మాంచి ఊపు వ‌స్తోంది. స్టైలీష్ లుక్‌తో పాటు సింపుల్ స్టెప్పుల‌తో ఇర‌గ‌దీశారు.

ఇక సాంగ్‌లో మ్యూజిక్ చాలా బాగా వ‌చ్చింది. సాంగ్ కోసం వేసిన సెట్టింగ్ కూడా క‌ళ్లు మిరుమిట్లు గొలిపేలా ఉంది. సాంగ్ వీడియో చూస్తూ వింటుంటే ప‌దే ప‌దే వినాల‌నిపిస్తోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీకి.. సుజీత్ డైరెక్షన్ చేస్తున్నాడు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ కావటంతో.. భారీ అంచనాలు ఉన్నాయి. ఆ రేంజ్ కు తగ్గట్టుగానే 200 కోట్ల బడ్జెట్ తో మూవీని నిర్మించారు.

ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా సాహో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. నీల్ నితిన్ ముఖేష్, జాకీష్రాఫ్, ఎవెలిన్ శర్మ, మందిరా బేడి, వెన్నెల కిషోర్, బొమన్ ఇరానీ కూడా కీ రోల్స్ పోషిస్తున్నారు. తమిళం, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ ఒకేసారి విడుదల అవుతోంది.

Leave a comment