పవన్‌కళ్యాణ్ ఫుల్ టైం పొలిటిషీయన్‌గా మారిపోయానని.. తాను ఇకపై సినిమాలు చేయనని ఇప్పటికే చెప్పేశారు. ఇలాంటి డైలాగులు ఇప్పటికే చాలాసార్లు చెప్పేశారు… ఇకపై చెపుతూనే ఉంటారని కూడా అనుకోవచ్చు. జనసేన ఈ ఎన్నికల్లో ఓడిపోయినా భవిష్యత్తులో అయినా మంచి నిబద్ధతతో నడపాలన్న పవన్ ఆశయం మంచిదే… ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే పవన్ ఎన్నికలకు ముందు కొంతమంది నిర్మాతల దగ్గర అడ్వాన్స్‌లు పుచ్చుకున్నాడు.
అజ్ఞాతవాసి తర్వాత ఓ కోలీవుడ్ హిట్ మూవీ రీమేక్‌లో సినిమా చేసేందుకు ఓ కోలీవుడ్ అగ్ర నిర్మాత (గతంలో పవన్ కూడా సినిమాలు చేశాడు) దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు. అలాగే టాలీవుడ్‌కు చెందిన మరో అగ్ర నిర్మాత దగ్గర కూడా భారీగానే అమౌంట్ తీసుకున్నట్టు టాక్. ఇప్పుడు ఈ అడ్వాన్స్‌ల సంగతి ఏంటన్నదానికి ఆన్సర్ లేదు.
హారిక హాసిని, మైత్రీ, ఇలా మరో ఒకటి రెండు అడ్వాన్స్ లు పవన్ దగ్గర వున్నాయని వినికిడి. వీరిలో మైత్రీది కాస్త పెద్ద మొత్తమే అని తెలుస్తోంది. అడ్వాన్స్‌లు అంటే కోట్లలోనే ఉంటాయి. వాటికి వడ్డీలు మామూలుగా ఉండవు. పవన్ ఇప్పుడు ఓపెన్‌గా సినిమాలు చేయనని చెపుతున్నా… అడ్వాన్స్‌లు ఇచ్చిన వాళ్లకు మాత్రం తాను సినిమాలు చేస్తానని కానీ… చేయనని కానీ చెప్పడం లేదట. అది సంగతి.
పవన్ ఇప్పుడు 50కు దగ్గరవుతున్నాడు. ఇక మరో రెండు మూడేళ్లు ఇలాగే గడిపేస్తే ఆ తర్వాత అతడికి వెండితెర క్రేజ్ ఇలాగే ఉంటుందా ? అన్నది డౌట్. అప్పుడు మళ్లీ ఎన్నికల మూడ్ ఉంటుంది. ఆ టైంలో పవన్ సినిమా చేసినా యూజ్ ఉండదు. అలాంటప్పుడు ఆ అడ్వాన్స్‌లు వెనక్కు ఇస్తేనే మంచిదేమో పవన్ కాస్త ఆలోచించొచ్చుగా..!