Gossipsఅక్కినేని కోడలు అంతుచిక్కని ఫార్ములా..!

అక్కినేని కోడలు అంతుచిక్కని ఫార్ములా..!

అక్కినేని కోడలిగా మారాక సినిమాల పరంగా సెలెక్టెడ్ స్టోరీస్ ఎంచుకుంటున్న సమంత ఫోటో షూట్స్ విషయంలో మాత్రం రాజీ పడట్లేదు. తానింకా పెళ్లి కాని అమ్మాయి అనుకుంటుందో ఏమో కాని కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసేస్తుంది. ఓ పెద్ద ఫ్యామిలీ ఇంటికి కోడలిగా వెళ్లాక ఇలాంటివి అవసరమా అంటే తను ఇంతకుముంది ఇలా ఉన్నప్పుడే కదా వాళ్లకు నచ్చింది అనేస్తుంది. అయినా తన ఫ్యామిలీకి లేని అభ్యంతరం మీకెందుకు అంటూ రివర్స్ క్వశ్చన్ వేస్తుంది.

కమర్షియల్ హీరోయిన్ గా ఉన్న క్రేజ్ తో ప్రస్తుతం ప్రయోగాత్మక సినిమాలు చేస్తుంది సమంత. అయితే ఫోటో షూట్స్ విషయంలో మాత్రం అసలు తగ్గట్లేదు. ప్రస్తుతం ఓ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సమంత ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా షాక్ ఇచ్చే డ్రెస్ తో ఈవెంట్ కు వచ్చింది. సినిమాల్లో అలా ఫోటో షూట్స్ లో ఇలా ఇవన్ని చూస్తున్న ఫ్యాన్స్ అక్కినేని కోడలు అసలు ఫార్ములా ఏంటో అర్ధం కాక బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు.

ఓ బేబీ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో పాటుగా తమిళంలో ఓ సినిమా చేస్తున్న సమంత నాగార్జున మన్మధుడు 2లో కూడా స్పెషల్ రోల్ చేస్తుంది. నాగార్జునతో మనం, రాజు గారి గది 2లో నటించిన సమంత ఇప్పుడు మన్మధుడు 2లో కూడా నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా సమంత మరో రెండు తెలుగు సినిమాల కథలు ఓకే చేసినట్టు తెలుస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news