వరుస ప్లాపుల్లో ఉన్న యంగ్ హీరో రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆశలన్నీ ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్‌పైనే ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితేనే వీరి కెరీర్ కాస్త పుంజుకుంటుంది లేకపోతే వీళ్ల మార్కెట్ మరింత దిగజారడం ఖాయం. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్‌కు ముందే కష్టాల్లో పడబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
సెన్సార్ ఈ సినిమాకు మామూలుగా వదలడం కష్టమే అని తెలుస్తోంది. భారీగా కట్స్ ఉండబోతున్నాయట. అసలు సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇండస్ట్రీ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. డైలాగుల్లోనే కాకుండా సీన్లలో అయితే కావాల్సినంత విచ్చలవిడితనం, విశృంఖలత్వం ఉందట.
ఇక ట్రైలర్ చూస్తూనే సినిమాలో కావాల్సినంత బోల్డ్నెస్ ఉంటుందని తెలుస్తోంది. పూరి అంటేనే బోల్డ్నెస్కు, పచ్చి బూతు డైలాగులకు కేరాఫ్. హీరోయిన్లతో కూడా చాలా పచ్చిగా మాట్లాడిచ్చేస్తుంటాడు. ఇక ఇస్టార్ట్లో రొమాంటిక్ సీన్లు, తెలంగాణ యాస డైలాగ్స్ మామూలుగా లేవట.
వాటిని యాజ్‌టీజ్‌గా వదిలేస్తే కావాల్సినంత రచ్చ అవుతుంది. అందుకే సెన్సార్ ఇస్మార్ట్‌ను మామూలుగా వదలదని కూడా తెలుస్తోంది. పూరి సినిమాకు హైప్ తీసుకువచ్చేందుకు పెట్టిన కొన్ని డైలాగులు కూడా సెన్సార్ కత్తెరకు బలి కావాల్సిందే అంటున్నారు. రీసెంట్ గా వచ్చిన ఫలక్ నుమా దాస్ అనే సినిమాకు కూడా ఇలానే భారీగా కోతలు పడిన సంగతి తెలిసిందే.