” ఇస్మార్ట్ శంకర్ ” థియేట్రికల్ ట్రైలర్

ఎనర్జిటిక్ స్టార్ రాం హీరోగా పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. పూరి, చార్మి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. నభా నటేష్ కూడా సినిమాలో స్పెషల్ రోల్ చేస్తుంది. ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. పూరి మార్క్ పక్కా మాస్ మూవీగా ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ ఉంది. రాం కెరియర్ లో మొదటిసారి పక్కా తెలంగాణ యాసలో నటిస్తున్నట్టు కనిపిస్తుంది.

పూరి మార్క్ టేకింగ్ తో పాటుగా మాస్ మసలా మూవీగా ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ ఉంది. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ అందుకోలేని పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టేలా ఉన్నాడు. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఇది రుచించడం కష్టమే అని పిస్తుంది. డబుల్ దిమాక్ ఇస్మార్ట్ శంకర్ యూత్ ఆడియెన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చేలా ఉన్నాడు. పూరి పక్కా హిట్ ఫార్ములారో ఈ సినిమా వస్తుంది. జూలై 18న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Leave a comment