ఏడు వరుస డిజాస్టర్లతో ఉన్న పూరి జగన్నాథ్… ఇటు హిట్ కోసం నాలుగేళ్లుగా మొఖం వాచిపోయి ఉన్న రామ్ కాంబినేషన్లో వస్తోన్న ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈ నెల 18న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ట్రేడ్ సర్కిల్స్‌లో టాప్ రేంజులో బిజినెస్ జరుగుతున్నట్టు ప్రీలర్లు వదులుతున్నారు. థియేట్రికల్ రైట్స్‌ను కాసేపు పక్కనపెడితే నాన్ థియేటర్ హక్కుల రూపంలో రూ. 14 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.
డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ టీవీకి, హిందీ డబ్బింగ్ హక్కులను వేరే వారికి విక్రయించినట్టు తెలుస్తోంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూ.14 కోట్లు అంటే మామూలు విషయం కాదు. వరుస ప్లాపుల్లో ఉన్న ఈ కాంబినేషన్‌కు ఇంత సీన్ ఉందా ? సినిమాకు హైప్ తీసుకు వచ్చేందుకే ఇలా చేస్తున్నారా ? అన్న అనుమానాలు కూడా ఉన్నాయ్.
ఇక థియేట్రికల్ రైట్స్ నుంచి రూ.20 కోట్లు వస్తాయని నిర్మాత చార్మీ, దర్శకుడు పూరి లెక్కులేసుకుంటున్నారు. ఆంధ్రకే 10 కోట్ల రేషియోలో చెబుతున్నారు. సినిమాకు ఇరవై కోట్లకు పైగా ఖర్చయినట్లు తెలుస్తోంది. రామ్, ఇద్దరు హీరోయిన్లు, కాస్త గట్టి స్టార్ కాస్ట్ వుండడం, మణిశర్మ సంగీతం ఇవన్నీ కలిపి ఖర్చు కూడా ఎక్కువే అయినట్టు చూపిస్తున్నారు.
ఖర్చు సంగతి ఎలా ఉన్నా క్రేజ్ లేని కాంబినేషన్ కావడంతో ఎక్కువ మొత్తం బిజినెస్ ఎలా జరుగుతుందో ? అర్థం కావడం లేదని ఇండస్ట్రీ జనాలు జుట్టు పీక్కుంటున్నారు. రిలీజ్‌కు ముందు ఎంత హంగామా చేసి హైప్ తీసుకువచ్చినా పూరి మళ్లీ పాత చింతకాయపచ్చడి జనాల్లోకి వదిలితే మరో ప్లాప్ వీళ్ల ఖాతాలో పడడంతో పాటు బయ్యర్లు భారీగా నష్టపోవాల్సిందే.