ఒకరోజు ఒక సినిమా విడుదల అనే ట్రెండ్ కు రెండేళ్ల క్రితమే గుడ్‌బై చెప్పేసిన టాలీవుడ్ ప్రతి శుక్రవారం రెండు మూడు సినిమాలతో సందడి సందడిగా కనిపిస్తోంది. సంక్రాంతి ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే శుక్రవారం టాలీవుడ్లో రెండు ప్రధాన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అగ్ర నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాక్షసుడు బరిలో ఉంది.
కోలీవుడ్‌లో రాచ్చసన్ పేరుతో తెరకెక్కి హిట్ అయిన ఈ సినిమాను కమర్షియల్ అంశాలకు దూరంగా కంటెంట్ ని నమ్ముకుని తెరకెక్కించారు. ఈ సీరియస్ సినిమా తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటాను అన్నది ఆసక్తిగా ఉంది. ఆన్లైన్లో తమిళ సినిమా చూసిన కొందరు తెలుగు ప్రేక్షకులు దీని మీద సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులు కురిపించారు.
ఇక రెండోది గుణ 369. ఆరెక్స్ 100తో సెన్సేషన్ హిప్పీతో డిజాస్టర్ రెండూ టేస్ట్ చేసిన కార్తికేయకు దీని సక్సెస్ చాలా అవసరం. ఈ శుక్రవారం ఈ రెండు సినిమాలకు లక్కీ ఫ్రైడే అని చెప్పాలి. మాస్ బలంగా ఉండే ప్రధాన కేంద్రాల్లో తప్ప ఇస్మార్ట్ శంకర్ చాలా చోట్ల నెమ్మదించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్ నాలుగో రోజుకే వీకవ్వడం బయ్యర్లకు గుబులు పుట్టిస్తోంది. మరీ దీనిని క్యాష్ చేసుకునే దమ్మున్న కంటెంట్ ఈ రెండు సినిమాల్లో ఉంటే వీక్ ఎండ్ తో పాటు మన్మథుడు 2 వచ్చేదాకా టికెట్ కౌంటర్లను దున్నేయొచ్చు.
అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలకు మంచి టాక్ రావడం ఒక్కటే మిగిలి ఉంది. ఇద్దరు హీరోలకు హిట్ అర్జెంట్. మరి వీరిలో ఎవరు బాక్సాఫీస్ దగ్గర తమ సినిమాతో పైచేయి సాధిస్తారో ? చూడాలి.