ఇంగ్లండ్‌కు షాక్‌… అదే జ‌రిగితే ఫైన‌ల్ ఛాన్స్ మిస్‌..!

తాజా ప్రపంచ కప్ టోర్నీ సెమీ ఫైనల్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌స్తుత చాంపియ‌న్ ఆస్ట్రేలియాను ఢీకొటోంది. గురువారం జ‌రిగే ఈ సెమీఫైన‌ల్‌పై యావ‌త్ క్రికెట్ క్రీడాభిమానుల క‌ళ్లు ఉన్నాయి. రెండు జ‌ట్లు పోటాపోటీగా ఉండ‌డంతో ఎవ‌రు గెలుస్తారా ? అన్న ఉత్కంఠ ఉంది. అయితే లీగ్ స్టేజ్ మ్యాచ్‌లో మాత్రం ఆస్ట్రేలియాదే పై చేయి అయ్యింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సెమీస్‌లో ఏదైనా తేడా వ‌స్తే ఆతిథ్య ఇంగ్లాండు జట్టు కొంప మునిగేట్లే ఉంది.

వానదేవుడు ఇంగ్లాండును ఓడించే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఇరు జట్ల మధ్య మ్యాచ్ జ‌రిగే ఎడ్జ్ బాస్టన్ మైదానంలో ఈ నెల 11వ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని ఇంగ్లండ్ వాతావ‌ర‌ణ శాఖాధికారులు చెపుతున్నారు. మ్యాచ్‌ జరగాల్సిన గురువారంనాడే కాకుండా రిజర్వ్‌డే నాడు కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయ‌ట‌.

ఈ రెండు రోజుల్లో ఒక్కరోజైనా కనీసం 20 ఓవర్ల మ్యాచ్‌ సాధ్యమైతే సమస్య ఉండదు. కానీ వర్షంతో రెండు రోజులు కూడా మ్యాచ్‌ సాధ్యంకాకపోతే మాత్రం ఇంగ్లాండ్‌ ఓటమి పాలు కాక తప్పదు. ఎందుకంటే ప్ర‌పంచ‌క‌ప్ నిబంధ‌న‌ల ప్ర‌కారం సెమీస్ ర‌ద్ద‌యితే లీగ్‌ దశలో ఇంగ్లాండ్‌ కన్నా ఎక్కువ పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా నేరుగా ఫైనల్‌కు చేరుతుంది.

ఈ ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటి వరకు ఏడు మ్యాచులకు వర్షం తాకిడి తప్పలేదు. లీగ్ ద‌శ‌లో ఆస్ట్రేలియా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా చేతుల్లో ఓడితే, ఇంగ్లండ్ పాకిస్తాన్‌, శ్రీల‌కం, ఆస్ట్రేలియాపై ఓడింది. దీంతో మూడు మ్యాచ్‌లు ఓడిన ఇంగ్లండ్ ఇంటికి వెళితే ఆసీస్ నేరుగా సెమీస్‌కు వెళుతుంది.

Leave a comment