ట్రైలర్ టాక్: దొరసాని ప్రేమ కూడా ఒక ఉద్యమమే!

రాజశేఖర్-జీవితల కూతురు శివాత్మిక వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమవుతూ తెరకెక్కిన దొరసాని మూవీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్న ఈ సినిమాపై మొదట్నుండీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌లు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ సుకుమార్ చేతులమీదుగా రిలీజ్ చేశారు.
ఈ చిత్రం తెలంగాణలో దొరల పాలన ఉన్నప్పటి బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కినా ప్రస్తుతం సమాజంలో ఉన్న తీరును మన కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. ఒక పెద్దింటి కుటుంబానికి చెందిన అమ్మాయిని నిరుపేద యువకుడు ప్రేమిస్తే జరిగే పరిణామాలను ఈ సినిమాలో చూపించాడు కొత్త దర్శకుడు మహేంద్ర. ఇక ఈ ట్రైలర్‌లో శివాత్మిక చాలా అందంగా కనిపించింది. అటు ఆనంద్ దేవరకొండ కూడా పర్వాలేదనిపించాడు.
మంచి అంచనాలు క్రియేట్ చేసిన దొరసాని చిత్రాన్ని జూలై 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సమర్పణలో వస్తుండటంతో ఇండస్ట్రీ వర్గాలు ఈ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment