టాలీవుడ్ రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘డియర్ కామ్రేడ్’ ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా చాలా చోట్ల నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. ఈ సినిమాలో చాలా అంశాలు సినిమాకు మైనస్‌గా మారడంతో దాన్ని తగ్గించే పనిలో పడ్డారు చిత్ర యూనిట్.
సినిమాకు పెద్ద మైనస్ పాయింట్‌గా మారిన చిత్ర రన్ టైమ్ ల్యాగింగ్‌గా అనిపించింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో సినిమా చాలా నెమ్మదిగా సాగిందని ప్రేక్షకులు రెస్పాన్స్ ఇచ్చారు. 2 గంటల 50 నిమిషాల రన్‌టైమ్ ఉండటంతో ఈ సినిమా చూస్తున్నంతసేపు కాస్త బోరింగ్‌గా ఫీల్ అయ్యారు ఆడియెన్స్. దీంతో సినిమా రన్‌టైమ్‌ను తగ్గించేందుకు కొన్ని సీన్స్‌ను తొలగించారు చిత్ర యూనిట్. సెకండాఫ్‌లో ఉన్న అనవసరపు సీన్స్‌ను 13 నిమిషాలపాటు తొలగించారు చిత్ర యూనిట్. దీంతో సినిమాను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేశారు.
మొత్తానికి చిత్రానికి వచ్చిన నెగెటివ్ టాక్‌తో దాన్ని కవర్ చేసే పనిలో చిత్ర యూనిట్ పడింది. విజయ్ దేవరకొండ సక్సెస్ ట్రాక్‌కు డియర్ కామ్రేడ్ బ్రేకులు వేసినట్లే అని సినీ ఎక్స్‌పర్ట్స్ అన్నారు. ఏదేమైనా ఈ సినిమాపై ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్న రౌడీ హీరోకు ఈ సినిమా గుణపాఠంగా మిగిలిందని చెప్పాలి.