బిగ్ బాస్ సీజన్ 3 మొదలైన రెండో రోజు నుండే అసలు ఆట మొదలైంది. మొదటి వారమే నామినేట్ అయిన సభ్యులు వారిని సేఫ్ చేసుకునేందుకు మిగతా ఇంటి సభ్యులను రిప్లేస్ చేయాల్సి ఉంది అక్కడే మొదలైంది అసలు గొడవ. ఎవరికి తమంతట తాము నామినేట్ చేసుకోవాలని ఉండదు కనుక నామినేట్ అయిన ఆరుగురు మిగతా ఇంటి సభ్యులను కార్నర్ చేయడం మొదలుపెట్టారు. మంగళవారం ఎపిసోడ్ లో శ్రీముఖి తనని తాను కాపాడుకునే క్రమంలో మరో ఇంటి సభ్యురాలు హిమజని నామినేట్ చేసింది.
మోనిటర్ గా ఉన్న హేమ శ్రీముఖిక్ సపోర్ట్ చేయడంతో హిమజ నామినేట్ అయ్యింది. నటిగా తనకు తెలిసిన హిమజ వేరు.. తను లైఫ్ చాలా లైట్ గా తీసుకుంటుంది. అలాంటిది ఇంట్లో ఆమె ఒక్కతే పనిచేస్తున్నట్టుగా చెప్పడం శ్రీముఖికి నచ్చక హిమజ గురించి హేమకి చెప్పింది. అయితే తను లైఫ్ గురించి అసలు ఏమాత్రం తెలియని శ్రీముఖి అలా అనడం పట్ల హర్ట్ అయ్యింది హిమజ. హౌజ్ మెట్స్ ముందే ఏడ్చి తను చాలా కష్టాలు పడి వచ్చానని.. తన మీద ఉన్న రెడ్ మార్క్ ను తీసుకునేందుకు కాస్త ఎక్కువ పని చేస్తున్నానని అన్నది హిమజ.
సో మంగళవారం ఎపిసోడ్ ఫన్ కన్నా ఎమోషనల్ గా సాగింది. శ్రీముఖి వర్సెస్ హిమజ.. డిష్యుం డిష్యుం అన్నట్టుగా జరిగింది. మరి ఈరోజు హౌజ్ మెట్స్ ఎలా ఆట కొనసాగిస్తారో చూడాలి. అసలు టాస్కులేమి మొదలవ్వకముందే బిగ్ బాస్ హౌజ్ ఇలా ఉడికిపోయింది అంటే ఇక టాస్కులు ఇస్తే ఇంటి సభ్యులు ఎలా మారుతారో చూడాలి.