Newsప్రపంచ‌క‌ప్ ఫినిషింగ్ ఇదేనా...

ప్రపంచ‌క‌ప్ ఫినిషింగ్ ఇదేనా…

ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్ 2019 చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. మ‌రో మూడు లీగ్ మ్యాచ్‌లు, రెండు సెమీఫైన‌ల్స్‌, ఫైన‌ల్ మాత్ర‌మే ఉన్నాయి. అందరూ ఊహించినట్టే.. అగ్రశ్రేణి జట్లే సెమీస్ కు చేరాయి. అద్భుతాల్ని ఊహించినా ఎక్కడా ఛాన్స్ రాలేదు. సాదాసీదాగా మొదలైన ప్రపంచకప్ వరుణుడు విలన్ లా మారండంతో ప్రారంభంలో టోర్నీ ఆసక్తి కలిగించలేదు. వరుణుడు పదకొండో జట్టుగా టోర్నీలో ఆడుతున్నాడంటూ క్రికెట్ అభిమానులు జోక్ చేసుకున్నారు. అయితే బంగ్లాదేశ్ మాత్రం అంచ‌నాల‌కు మించి రాణించి… ఒకానొక ద‌శ‌లో సెమీఫైన‌ల్ రేసులో నిలిచింది.

ఇక ఆధిత్య దేశ‌మైన ఇంగ్లండ్ ప‌డుతూ లేస్తూ సెమీస్‌కు వ‌చ్చింది. సెమీస్‌కు చేరుకున్న నాలుగు జ‌ట్ల గురించి చూస్తే ప్ర‌స్తుత విజేత ఆసీస్ ఒక్క ఇండియాతో మ్యాచ్ మాత్ర‌మే ఓడింది. ఎక్కడా తడబాటు లేకుండా ఆడి టైటిల్ ఫేవరేట్ ఎలా ఉండాలో చూపించారు కంగారూలు. త‌న చివ‌రి మ్యాచ్ ఆసీస్ ద‌క్షిణాఫ్రికాతో ఆడుతోంది. ఆ మ్యాచ్‌లో కూడా గెలిస్తే లిస్టులో టాప్ ప్లేసులో ఉంటుంది.

ఇక క‌ప్ గ్యారెంటీగా గెలుస్తుంద‌న్న అంచ‌నాల‌తో టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇండియా అదే తరహా ఆటతీరు ప్రదర్శించింది. న్యూజిలాండ్ మ్యాచ్ వ‌ర్షం వ‌ల్ల ర‌ద్ద‌య్యింది. త‌న చివ‌రి మ్యాచ్‌లో లంక‌తో శ‌నివారం ఆడుతోన్న ఇండియా ఆ మ్యాచ్‌లో గెలిచి… ద‌క్షిణాఫ్రికా చేతిలో ఆసీస్ ఓడితే టాప్ ప్లేస్‌లో ఉండడంతో పాటు కీవీస్‌తో సెమీస్ ఆడుతుంది. ఇలా జ‌ర‌గ‌కుండా ఇండియా రెండో స్థానంలో ఉంటే ఇంగ్లండ్‌తో సెమీస్ ఆడాల్సి ఉంటుంది.

ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ప్రారంభంలో ఆదరగొట్టింది. తరువాత నీరసించింది. ఆసీస్‌, పాక్‌, లంక‌పై వ‌రుస ఓట‌ముల‌తో అస‌లు సెమీస్‌కు చేరుతుందా ? అన్న డిఫెన్స్‌లో ప‌డిపోయింది. చివ‌ర‌కు భార‌త్‌, న్యూజిలాండ్ మీద వ‌రుస ఘ‌న‌విజ‌యాల‌తో హుందాగా మూడో ప్లేస్‌తో సెమీస్‌కు వెళ్లింది.

నాలుగో స్థానానికి విచిత్రమైన పోటీ నెలకొంది. కొన్ని జట్ల పరాజయం కోసం పాకిస్థాన్ ఎదురుచూసింది. అయితే పాక్ అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌లేదు. ప్ర‌పంచ‌క‌ప్‌లో ప‌డుతూ లేస్తూ వ‌స్తూ చివ‌రి మూడు మ్యూచ్‌ల‌లో ఓడిన కీవీస్ 11 పాయింట్లు సాధించి.. మెరుగైన ర‌న్‌రేట్‌తో నాలుగో ప్లేస్‌లో నిలిచి సెమీస్‌కు వ‌చ్చింది. కీవీస్ అంచ‌నాలు అయితే అందుకోలేదు. ఇక ఇప్పుడున్న ప‌రిస్థితుల ప్ర‌కారం ఆస్ట్రేలియా – కీవీస్ మ‌ధ్య తొలి సెమీస్‌, ఇంగ్లండ్ – ఇండియా మ‌ధ్య రెండో సెమీస్ జ‌రిగే ఛాన్సులు ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news