తెలుగు,తమిళ,మళియాళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది అమలాపాల్. ఈ అమ్మడు సినిమాల్లో నటించినదానికన్నా బయట కాంట్రవర్సీలే ఎక్కువ. మలీవుడ్ దర్శకుడిని వివాహం చేసుకొని కొంత కాలానికే విడాకులు ఇచ్చింది. ఇటీవల తాను ప్రేమలో ఉన్నానని చెప్పింది..ఇక అమలాపాల్ నటించిన ‘ఆమె’ మూవీ ఎన్ని కాంట్రవర్సీలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. అందం, అభినయం ఉన్నా కూడా అమలకు తెలుగులో సరైన అవకాశాలు రాలేదు. అయితే తమిళంలో మాత్రం అడపా దడపా చిన్నా చితకా సినిమాలు చేస్తోంది.
ఇక అమలా పాల్ లేటెస్ట్ సెన్సేషన్ సినిమా తమిళంలో ‘ఆడై’ , తెలుగులో ఆమె గా ఒకేసారి రెండు భాషల్లో గత శుక్రవారం రిలీజైన సంగతి తెలిసిందే. ఇక తెలుగులో అయితే ప్రింట్ ఖర్చులకి కూడా డబ్బులు రావడం లేదని టాలీవుడ్ మీడియా సమాచారం. అంటే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
ఈ సినిమా ఇంటర్వెల్ తరువాత నుండి అమలా పాల్ దాదాపు ఒక గంట సేపు నగ్నంగానే కనిపిస్తుంది. పాపం అమల ఇంత రిస్క్ చేసి సినిమా చేసినా వసూళ్లు మాత్రం రావడంలేదు. పాపం స్టార్ హీరోయిన్ నగ్నంగా నటించిందన్నా జనాలు పట్టించుకోకపోవడంతో ఈ సినిమా భారీ నష్టాలు చవిచూస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.