Newsప్ర‌పంచ‌క‌ప్‌లో 27 ఏళ్ల సచిన్ రికార్డు బ్రేక్ చేసిన ఆఫ్గనిస్తాన్ యంగ్‌స్ట‌ర్‌..

ప్ర‌పంచ‌క‌ప్‌లో 27 ఏళ్ల సచిన్ రికార్డు బ్రేక్ చేసిన ఆఫ్గనిస్తాన్ యంగ్‌స్ట‌ర్‌..

ఇంగ్లాండ్లో జరుగుతున్న ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 27 సంవత్సరాల క్రితం క్రియేట్ చేసిన రికార్డు బద్దలైంది 1992లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్‌పై 84 ప‌రుగులు చేశారు. అదే యేడాది మ‌రో మ్యాచ్‌లో స‌చిన్ 81 ప‌రుగులు చేశారు. కేవ‌లం 18 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో స‌చిన్ చేసిన ప‌రుగులు ఇప్ప‌ట‌కి చ‌రిత్ర‌లో చెక్కు చెద‌ర‌కుండా ఉన్నాయి.

అప్ప‌టి నుంచే స‌చిన్ రికార్డుల ప‌రంప‌ర కొన‌సాగింది. 27 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఈ రికార్డు ఎట్ట‌కేల‌కు బ‌ద్ద‌లైంది. తాజా ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంటులో భాగంగా గురువారం అప్ఘ‌నిస్తాన్, వెస్టిండిస్ జ‌ట్లు త‌మ చివ‌రి మ్యాచ్‌లో త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్ విసిరిన 312 ప‌రుగుల ల‌క్ష్యం చేధించే క్ర‌మంలో అప్ఘ‌న్ అద్భుత‌మైన పోరాటం చేసింది.

ఆ జ‌ట్టు ఓపెనర్ ఇక్రమ్‌ అలిఖిల్ 93 బంతుల్లో 86; 8 ఫోర్లు సాధించి స‌చిన్ రికార్డు బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్‌ను రహ్మత్‌ షా, ఇక్రమ్‌ జోడీ నిలబెట్టింది. ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 133 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఇక్రమ్‌కు జతయిన నజీబుల్లా కూడా మెరుగ్గా ఆడటంతో విండీస్‌కు కష్టాలు తప్పలేదు. గేల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 36వ ఓవర్‌లో ఇక్ర‌మ్ వికెట్ల ముందు దొరికిపోవ‌డంతో అత‌డి ఇన్నింగ్స్‌కు తెర‌ప‌డింది. లేకుంటే అదే ఊపులో ఇక్ర‌మ్ సెంచ‌రీ చేస్తాడనిపించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news