ఎన్నో ఆశలతో ప్రారంభమైన 2019లో ఫస్టాఫ్ రిపోర్ట్ చూస్తే టాలీవుడ్‌కు అంత ఆశాజనకంగా లేదు. సంక్రాంతి నుంచి చూస్తే ఎన్టీఆర్ బయోపిక్ కథనాయకుడు, రామ్‌చరణ్ వినయవిధేయ రామ రెండు బిగ్గెస్ట్ డిజాస్టర్లు. ఎఫ్ 2 బ్లాక్ బస్టర్. రజనీ డబ్బింగ్ మూవీ పేట కూడా ప్లాపే. ఇక అఖిల్‌కు మిస్టర్ మజ్నుతో మూడో ప్లాప్ దక్కింది.
ఫిబ్రవరిలో రెండు బయోపిక్‌లు వచ్చాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన యాత్రకు ప్రశంసలు బాగున్నా.. కమర్షియల్‌గా అంత సక్సెస్ కాలేదు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2 మహానాయకుడు ఆల్ టైం డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. సంక్రాంతికి వచ్చిన ఎఫ్ 2 మినహా తొలి రెండు నెలలు చెప్పుకోదగ్గ హిట్ లేదు.
మార్చిలో కళ్యాణ్‌రామ్‌కు 118 ఊరట ఇచ్చింది. అడల్ట్ కంటెంట్ కలిసి రావడంతో చీకటి గదిలో చితక్కొట్టుడు టార్గెట్ ఆడియన్స్‌ని ఆకట్టుకుని సక్సెస్ అయింది. రామ్‌గోపాల్‌వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ తెలంగాణలో రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది. ఈ నెలలో 20 సినిమాలు వస్తే పై మినహా మిగిలివన్నీ ప్లాప్‌లే.
నిహారిక కొణిదెల చేసిన మరో ప్రయత్నం సూర్యకాంతం, వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి సూపర్ ప్లాప్ అయ్యాయి.
ఇక సమ్మర్‌లో నాగచైతన్య – సమంత మజిలీ, నాని జెర్సీ, సాయితేజ్ చిత్రలహరి పర్వాలేదనిపించాయి. మజిలీ సూపర్ హిట్ కాగా మిగిలిన రెండు ఓకే అనిపించాయి. ఇక రాఘవ లారెన్స్ కాంచన -3 మరోసారి కాంచన సీరిస్ బాక్సాఫీస్ దండయాత్ర ఫ్రూవ్ చేసింది. ఇక సమ్మర్‌లో మహేష్‌బాబు మహర్షి సూపర్ హిట్ అయ్యింది. యావరేజ్ టాక్‌తో కూడా ఈ సినిమా మంచి వసూళ్లతో మహేష్ ఖాతాలో మరో హిట్ వేసింది.
అల్లు శిరీష్ ఏబీసీడీ, బెల్లంకొండ సీత అట్టర్ ప్లాప్ అయ్యాయి. మేలో రిలీజ్ అయిన సినిమాలలో ‘ఫలక్‌నుమా దాస్’ తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రభావం చూపించగలిగింది. ఇక ఫస్టాఫ్‌కు ఇంటర్వెల్ బ్యాంగ్ అయిన జూన్ నెలలో మళ్లీ డల్ వాతావరణమే ఉంది. హిప్పీ, సెవెన్, ఫస్ట్ ర్యాంక్ రాజు ప్లాప్‌లకే ప్లాప్ అయ్యాయి. జూన్ రిలీజ్‌లలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, తాప్సీ నటించిన గేమ్ ఓవర్, మల్లేశంకు ప్రశంసలు వచ్చాయి. చివర్లో వచ్చిన కల్కి యావరేజ్‌గా ఉంటే, బ్రోచేవారెవరురా హిట్ టాక్ తెచ్చుకుంది.