Gossipsవైడ్ బాల్‌తో విలియ‌మ్స‌న్ వికెట్ తీసిన కోహ్లీ..

వైడ్ బాల్‌తో విలియ‌మ్స‌న్ వికెట్ తీసిన కోహ్లీ..

ఇంగ్లండ్లో నెల‌న్న‌ర రోజులుగా జ‌రుగుతోన్న ప్రపంచకప్‌-2019 టోర్నీ తుది దశకు చేరింది. మెగా టోర్నీలో తొలి రసవత్తపోరుకు రంగం సిద్దమైంది. ప్ర‌స్తుతం ఇండియా వైజ్‌గా ఎక్క‌డ చూసినా క్రికెట్ నామ‌స్మ‌ర‌ణ‌తో అభిమానులు ఉర్రూత‌లూగిపోతున్నారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు భారత్‌-న్యూజిలాండ్‌ తొలి సెమీస్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. విచ‌త్రం ఏంటంటే 11 ఏళ్ల నాటి సంఘ‌ట‌నే ఈ రోజు కూడా పున‌రావృతం కాబోతుంది.

2008 అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో తలపడ్డ సారథులే ఈ మెగా టోర్నీలో ఒకరినొకరు ఢీ కొంటున్నారు. అప్పుడు భారత సారథి విరాట్‌ కోహ్లి పైచేయి సాధించగా.. ఇప్పుడు ఎవరు గెలుస్తారనే చర్చ క్రికెట్‌ వర్గాల్లో ఊపందుకుంది. ఆ మ్యాచ్‌లో సెమీఫైనల్లో కోహ్లీ సార‌థ్యంలోని భార‌త్ విలియ‌మ్స‌న్ సార‌థ్యంలోని కీవీస్‌పై గెలిచింది. ఇప్పుడు మ‌ళ్లీ అదే కెప్టెన్లు మెగా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో సార‌థులుగా మ‌ళ్లీ ఇవే రెండు జ‌ట్లు సెమీస్ ఆడుతున్నాయి.

ఈ నేపథ్యంలో నాటి మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విష‌యాన్ని కెప్లెన్ కోహ్లీ గుర్తు చేసుకోవ‌డం విశేషం. నాటి అండ‌ర్ ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైనల్లో ఓ వైడ్‌ బంతితో కోహ్లి కివీస్ సారథి విలియమ్సన్‌ను బోల్తా కొట్టించాడు. ఈ క్ర‌మంలోనే తాను చాలా డేంజ‌ర్ బౌల‌ర్‌ను అని.. అప్పుడే విలియ‌మ్స‌న్‌ను అవుట్ చేశాన‌ని.. అయితే ఇప్పుడు త‌మ బౌల‌ర్లు వారి ప‌ని క‌రెక్టుగా నిర్వ‌హిస్తుండ‌డంతో త‌న‌కు బౌలింగ్ చేసే ఛాన్స్ లేద‌ని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news