కె.జి.ఎఫ్ డైరక్టర్ తో ఎన్.టి.ఆర్.. నందమూరి ఫ్యాన్స్ కి పండగే..!

కె.జి.ఎఫ్ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన ప్రశాంత్ నీల్ ఆ ఒక్క సినిమాతో అందరి కన్నుల్లో పడ్డాడు. ఆ సినిమాతో యశ్ కూడా సౌత్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఇవన్ని ఒక ఎత్తైతే కె.జి.ఎఫ్ తో హిట్టు కొట్టిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వల్ ను చేస్తున్నాడు. అది కూడా భారీ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారని తెలిసిందే.

ఇదిలాఉంటే కె.జి.ఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తాడని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుందని తెలుస్తుంది. మైత్రి బ్యానర్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని ఈ ఎనౌన్స్ మెంట్ చేశారు. ప్రశాంత్ నీల్ తో తారక్ సినిమా అంటే ఇక ఆ సినిమా రేంజ్ ఏంటన్నది ఊహించుకోవచ్చు. తప్పకుండా ఇది మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పడంలో సందేహం లేదు.

ప్రస్తుతం తారక్ ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత కె.జి.ఎఫ్ డైరక్టర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడట. నిజంగానే ఇది ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే వార్త అని చెప్పొచ్చు. ట్రిపుల్ ఆర్ తర్వాత త్రివిక్రం తో తారక్ సినిమా ఉంటుందని అన్నారు కాని ప్రశాంత్ నీల్ తోనే ఎన్.టి.ఆర్ సినిమాకు రెడీ అవుతాడట. మరి ఆ సినిమా ఎలా ఉంటుంది బడ్జెట్ ఎంత అన్నది త్వరలో తెలుస్తుంది.

Leave a comment