బిగ్ బాస్ 3 ఆగిపొతుందా..?

బిగ్ బాస్ సీజన్ 3 గురించి ఓ సంచలన న్యూస్ చెక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న బిగ్ బాస్ షో 12 సీజన్ల నుండి సక్సెస్ ఫుల్ అవుతుంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న ఈ బిగ్ బాస్ మిగతా భాషల్లోకి కూడా వచ్చింది. ఆల్రెడీ తెలుగులో రెండు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 3వ సీజన్ హోస్ట్ దగ్గర నుండి కంటెస్టంట్స్ విషయంలో జాగ్రత్తలు పడుతున్నారు.

కింగ్ నాగర్జున హోస్ట్ గా చేయబోతున్న బిగ్ బాస్ సీజన్ 3 లో ఉదయభాను, శ్రీ రెడ్డి, శ్రీముఖి, వరుణ్ సందేష్ లాంటి స్టార్స్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తుంది. అయితే సంచలనాల శ్రీ రెడ్డి బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తుందని తెలియగా మిగతా ఇంటి సభ్యులు షాక్ అవుతున్నారట. ఆమె బయటే ఏమాత్రం జంక కుండా బూతులు మాట్లాడుతుంది. ఒకవేళ హౌజ్ లో గొడవ అయితే ఆమెను ఆపడం కష్టమని భావిస్తున్నారట.

అయితే ఫిల్మ్ నగర్ లో కొంతమంది బిగ్ బాస్ 3 ఆగిపోతుందని.. హోస్ట్ గా నాగార్జున కూడా షో మీద అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదని అంటున్నారు. మళ్లీ హోస్ట్ ను వెతికే క్రమంలో ఈ ఇయర్ బిగ్ బాస్ కష్టమే అని భావిస్తున్నారట. స్టార్స్ అంతా తమ సినిమాలతో బిజీగా ఉండగా బిగ్ బాస్ హోస్ట్ గా చేసే వాళ్లు కరువయ్యారట. మరి బిగ్ బాస్ 3 స్పెషల్ అప్డేట్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.

Leave a comment