మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. సైరా లేటెస్ట్ అప్టేట్‌ ఇదే

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా 151 వ సినిమాగా తెరకెక్కుతున్న సైరా సినిమా గురించి ఏ న్యూస్ వచ్చిన మెగా అభిమానులు అదిరిపోయే పండగ చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌ ప్రాంతంలోని ఉయ్యాలవాడకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర‌ సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార ప్రధాన హీరోయిన్‌గా నటిస్తుండగా.. మిల్కీబ్యూటీ తమన్నా కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ స్థాయి నటుల‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేస్తున్నారు. కొణిదల ఎంటర్‌టైన్మెట్స్ బ్యానర్ పై చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సైరాను తెరకెక్కిస్తున్నారు. సౌత్ ఇండియాలోని అన్ని లాంగ్వేజెస్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

తాజాగా చిత్ర టైలర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న ట్రైలర్‌ రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్, సుదీప్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సైరాకు అన్ని ఏరియాల నుంచి అదిరిపోయే బిజినెస్ వస్తున్నట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ చాలా ప్లాన్డ్‌గా సైరా బిజినెస్ చేసే ఆలోచనలో ఉన్నారు.

Leave a comment