మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమా సైరా. రాయలసీమ పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా తన సొంత బ్యానర్‌లో రామ్‌చరణ్ తేజ్ నిర్మిస్తున్నారు. నయనతార ప్రధాన హీరోయిన్.
ఇక సైరాను అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. సినిమా బడ్జెట్ రూ.150 కోట్ల పైమాటే.. చిరు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నటించిన ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ అయ్యింది. ఇక సైరా పోస్టర్లు, స్టిల్స్ రిలీజ్ అవుతున్నాయి. సినిమాకు క్రేజ్ తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నా ఎందుకో అనుకున్నంత హైప్ రావడం లేదు.
రీసెంట్‌గా వచ్చిన మహేష్‌బాబు మహర్షి సినిమా విషయంలోనూ ఇదే జరిగింది… అయితే మహర్షి బడ్జెట్ వేరు.. దాని కథ వేరు. కానీ సైరా అలా కాదు.. భారీ బడ్జెట్.. చారిత్రాత్మక కథ అయినా హైప్ తక్కువుగా ఉంది. రాజమౌళి బాహుబలి సినిమాలకు ముందు ఎలాంటి హైప్ వచ్చిందో అందరం చూశాం. ఇప్పుడు సైరా విషయంలో ఆ రేంజ్ హైప్ లేదన్నది వాస్తవం.
ఇక మరో భారీ బడ్జెట్ సినిమా ప్రభాస్ సాహో. సైరాతో పోలిస్తే సాహోకే కాస్త ఎక్కువ క్రేజ్, హైప్ ఉన్నట్టు ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్‌లో చర్చలు నడుస్తున్నాయి. సాహో రిలీజ్ డేట్ ఆగస్టు 15న దగ్గర పడుతుండడంతో ఇప్పుడిప్పుడే బిజినెస్ డీల్స్ స్టార్ట్ అయ్యాయి. మరి సైరా విషయంలో ఏం జరుగుతుందో ? చూడాలి.