‘ సాహో ‘ టీజ‌ర్‌… మైండ్ బ్లోయింగ్ యాక్ష‌న్‌.. ఇండ‌స్ట్రీ రికార్డులు బ‌ద్ద‌లే

కొద్ది రోజులుగా ఊరిస్తోన్న ప్ర‌భాస్ సాహో సినిమా టీజ‌ర్ వ‌చ్చేసింది. రూ. 250 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న సాహో ఆగ‌స్టు 15న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా రిలీజ్ అయిన టీజ‌ర్ 1.40 నిమిషాల నిడివి ఉంది. టీజ‌ర్‌లో లెక్క‌లేన‌న్ని ఫ్రేములు ఉన్నాయి. ప్ర‌తి ఫ్రేములోనూ యాక్ష‌నే క‌నిపించింది. బైక్‌, కారు చేజింగ్‌లు వావ్ అనిపించేలా ఉన్నాయి.

టీజ‌ర్‌లో సినిమాలో ఉండే అన్ని క్యారెక్ట‌ర్ల‌ను రివీల్ చేశారు. ఇంత‌కు హీరో ఎవ‌ర‌నేది కూడా హీరోయిన్‌కు తెలియ‌ద‌ని టీజ‌ర్ చెపుతోంది. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలను తలపించే హై టెక్నికల్ వాల్యూస్‌‌తో హై వోల్టేజ్ క్రియేట్ చేస్తూ టీజ‌ర్ వ‌దిలారు. హీరోకు, విల‌న్ల‌కు మ‌ధ్య భీక‌ర‌మైన పోరు జ‌రుగుతుంద‌ని టీజ‌ర్‌లోనే ద‌ర్శ‌కుడు సుజీత్ చెప్పేశాడు.

యాక్ష‌న్ స‌న్నివేశాలే సినిమాకు హైలెట్ అని టీజ‌ర్ చెప్పేసింది. అబుదాబీలో 60 రోజులపాటు కష్టపడి చేసిన యాక్ష‌న్‌, చేజింగ్ సీన్లు చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌డం లేదు. ఎక్క‌డ ఒక సెక‌న్ సీన్ మిస్ అయిపోతామో అన్న ఉత్కంఠ‌గా టీజ‌ర్ క‌ట్ చేశారు. సినిమాలో గ్రాఫిక్స్‌ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో కూడా టీజర్‌లోనూ చూపించేశారు.

ప్రభాస్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న శ్రద్ధాకపూర్‌, మెయిన్ విలన్‌ నీల్‌ నితిన్‌ ముఖేష్‌లతో పాటు అరుణ్ విజయ్‌, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్‌, మహేష్ మంజ్రేకర్‌, మందిరా బేడి, ఎవ్లిన్‌ శర్మ, వెన్నెల కిశోర్‌లను టీజర్‌లోనే పరిచయం చేశారు. ఏదేమైనా సాహో సినిమా రికార్డులు బ్రేక్ చేసేందుకు రెడీగా ఉంద‌ని టీజ‌ర్ చెప్పేసింది.

Leave a comment