సాహో త్వరలో రిలీజ్ అయ్యే ఈ నేషనల్ క్రేజీ మూవీపై ఎక్కడా లేని ఆసక్తి నెలకొంది. ప్రమోషన్ల పరంగా కాస్త డల్‌గా ఉన్నా ప్రభాస్‌కు బాహుబలి సీరిస్ సినిమాలతో వచ్చిన క్రేజ్‌తో ఒక్కసారిగా నేషనల్ స్టార్‌గా మారిపోయాడు. ప్రభాస్ కష్టాన్ని చూసిన నార్త్ ఇండియన్ ప్రేక్షకులు కూడా అతడి పాత సినిమాలను యూట్యూబ్‌లో పదే పదే చూస్తున్నారు. ఈ క్రమంలోనే బాహుబలి మార్కెట్ స్టెబిలిటీ కోసం రూ.250 కోట్లతో సాహో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
సాహో ఆగస్టు 15న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రైట్స్ దక్కించుకునేందుకు తెలుగు, తమిళ్, హిందీతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు బడా దిగ్గజాలు లైన్లో ఉన్నారు. తెలుగులో అయితే టాప్ నిర్మాతలుగా ఉన్న వారితో పాటు బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థలు భారీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. ఓవర్సీస్ రైట్స్ కోసం జరుగుతోన్న పోటీ అంతా ఇంతా కాదు.
టోటల్ ఓవర్సీస్ రైట్స్ కోసం దుబాయ్‌కు చెందినో ఓ సంస్థ రూ. 82 కోట్లు ఆఫర్ చేసినట్టు టాక్. ఇక హిందీ రిలీజ్ హక్కుల్ని ప్రతిష్ఠాత్మక టీ- సిరీస్ చేజిక్కించుకుంది. హిందీ రైట్స్ రేటు ఎంతన్నది తేలకపోయినా టీ – సీరిస్ భారీ మొత్తమే ఇచ్చిందంటున్నారు. ఇక దుబాయ్ కంపెనీ `ఫార్స్ ఫిలింస్` విదేశీ రిలీజ్ హక్కులు చేజిక్కించుకుందని వార్తొలచ్చాయి. ఈ కంపెనీ కేవలం మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో మాత్రమే రిలీజ్ చేస్తుందట.
మిగిలిన దేశాల్లో ప్రఖ్యాత బాలీవుడ్ దిగ్గజ డిస్ట్రిబ్యూషన్ సంస్థ యశ్‌రాజ్ కంపెనీ వాళ్లు రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా సాహో రైట్స్ కోసం బడా సంస్థల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమాలకు ఓవర్సీస్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. అమెరికా.. బ్రిటన్.. కెనడా.. మలేషియా.. ఆస్ట్రేలియా.. న్యూజిల్యాండ్.. కొరియా .. జపాన్.. చైనా లాంటి దేశాల్లో సాహోను భారీ ఎత్తున రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.