టాలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ కాస్ట్లీ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న సాహో రిలీజ్‌కు కేవలం 45 రోజుల టైం మాత్రమే ఉంది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న ఈ భారీ బడ్జెట్ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌పై ప్రేక్షకుల్లో ఉండాల్సిన ఉత్సాహం అయితే కనబడటం లేదు. సినిమా ముందు నుంచి ఎలాంటి చిన్న విషయం కూడా లీక్ కాకుండా గోప్యత పాటించారు.
ఇక ఊరించి ఊరించిన టీజర్ వచ్చి రెండు వారాలు అవుతుంది. టీజర్ తాలూకు ఉత్సాహం అప్పుడే నీరుగారిపోయింది. ఇప్పుడు ఆ టీజర్ గురించి ఎవరు మాట్లాడటం లేదు. ఏకంగా రూ. 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అవుతోంది. సినిమా కు తగినట్టుగా ప్రమోషన్లు మాత్రం ఎక్కడ కనపడటం లేదు. తెలుగు వరకు హైప్ ఉన్నా మిగిలిన రాష్ట్రాల్లో ఈ సినిమా హడావుడి లేదు.
బాలీవుడ్‌లో బాహుబలి రాజమౌళి టీం ఏ రేంజ్ లో ప్రమోషన్లు చేసిందో చూశాం. అందుకే అక్కడ ఆ సినిమా ఏకంగా రూ. 500 కోట్లకు పైగా రాబట్టింది. సాహో కూడా రేపు దక్షిణాది భాషలతో పాటు హిందీలో భారీ వసూళ్లు రాబట్టాలంటే అందుకు తగ్గ ప్రమోషన్లు ఉండాలి. కానీ చిత్ర యూనిట్ నుంచి ఆ రేంజులో ప్రమోసన్లు ఉన్నట్టు లేవు.
అన్ని భాషల్లోనూ ఇప్పటికే ఇంటర్వ్యూలు స్టార్ట్ అవ్వాలి. టీజర్లు, ట్రైలర్లు టీవీల్లోనూ, సోషల్ మీడియాల్లోనూ హోరెత్తాలి. ఇంకా కొంత ప్యాచ్ వర్క్‌తో పాటు ఓ పాట కూడా షూటింగ్ మిగిలి ఉంది. ఏదేమైనా సాహో యూనిట్ ఇప్పటకీ అయినా మొద్దు నిద్ర తరహాలో కాకుండా ప్రమోషన్ల విషయంలో కొత్తగా ఆలోచించాలి… లేకుండా సాహో చూడాలన్న ఉత్సాహం నీరుగార్చేసినట్టే అవుతుంది. ఇక ప్రమోషన్ల విషయంలో కూడా కాస్త స్పీడ్ పెంచితే మంచి ఓపెనింగ్స్ లభిస్తాయి.