‘ సాహో ‘ కు అది బిగ్ మైన‌స్సే… రిజ‌ల్ట్‌పై ద‌డ ద‌డ‌..

యుంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – శ్రద్ధా కపూర్ కలిసి నటిస్తున్న చిత్రం సాహో. రన్ రాజా రన్ సినిమా తో విజయం సాధించిన సుజీత్ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తోన్న సంగ‌తి తెలిసిందే. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూ.250 కోట్ల‌కు పైగా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదల కావడం విశేషం. ఇప్పటికే ఆగస్టు 15న వైర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన సాహో టీజ‌ర్ చూస్తుంటే థియేట‌ర్లో మ‌నం మ‌రో ప్ర‌పంచంలోకి వెళ్లిపోతామ‌న్న ఆశ్చ‌ర్యం క‌లిగించేలా ఉంది. 1.39 సెక‌న్ల పాటు ఉన్న టీజ‌ర్‌లోనే క‌ళ్లార్ప‌కుండా చూసేలా షాట్స్ ఉన్నాయి. ఇక సాహో ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్‌లో ఉంద‌న్న టాక్ వ‌స్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సినిమాకు ఒక్కటే బిగ్గెస్ట్ డ్రా బ్యాక్ అంటున్నారు.

సినిమాలో కామెడీ తాలూకు సీన్లు చాలా తక్కువ ఉన్నాయని, స్పెషల్ గా కామెడీ ట్రాక్ ఏమి లేదంటున్నారు. ద‌ర్శ‌కుడు త‌న కాన్‌సంట్రేష‌న్ అంతా యాక్ష‌న్ మీదే పెట్టేయ‌డంతో కామెడీకి స్కోప్ లేకుండా పోయింద‌ట‌. కేవ‌లం సినిమాలో ఉన్న పాత్ర‌ల మ‌ధ్యే కామెడీ పుట్టేలా కొన్ని సీన్లు ఉండ‌డంతో ఈ కామెడీనే యూనిట్ నమ్ముకున్నారట‌.

భారీ బ‌డ్జెట్‌… ఇప్ప‌టి త‌రం ప్రేక్ష‌కుల్లో చాలా మంది… ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియెన్స్ రావాలంటే ఎమోష‌న్‌, కామెడీ ముఖ్యం ఇవి రెండు మిస్ అయితే కొన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు సినిమాపై ఇంట్ర‌స్ట్ చూప‌రు. అప్పుడు సాహో ప‌రిస్థితి ఏంట‌న్న‌ది కూడా డైల‌మాలోనే ఉంది.

Leave a comment