సాహోకు ఎదురెళుతోన్న సీనియ‌ర్… డేంజ‌ర్లో ప‌డిన‌ట్టేగా…

ఇప్పుడు ప్ర‌భాస్ మామూలు ప్ర‌భాస్ కాదు బాహుబ‌లి ప్ర‌భాస్‌. బాహుబ‌లి సీరిస్‌ సినిమాలతో ఒక్కసారిగా నేషన‌ల్ హీరోగా మారిపోయిన ప్రభాస్ బాహుబలి ది కంక్లూజన్ సినిమా తర్వాత చాలా లాంగ్‌ గ్యాప్ తీసుకుని నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో. బాహుబలి సినిమాతో నేష‌న‌ల్ హీరోగా మారిపోయిన ప్రభాస్ బాహుబలి మార్కెట్ ను కంటిన్యూ చేసే క్రమంలో వరుసగా భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుజీత్‌ డైరెక్షన్లో సాహో… జిల్‌ రాధాకృష్ణ డైరెక్షన్లో జాన్ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఈ యేడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సాహో సినిమా కోసం రెండు సంవత్సరాలుగా వెయిటింగ్‌లో ప్రేక్షకులకు గుడ్ న్యూస్‌.

ఆగస్టు 15వ తేదీన సాహో రిలీజ్ అవుతోంది. ఇప్పుడు సాహో కు పోటీగా సీనియర్ హీరో నాగార్జున నటిస్తున్న మన్మధుడు 2సినిమా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాహో భారీ బడ్జెట్ సినిమా మన్మధుడు 2పై ఓ మోస్త‌రు అంచనాలే ఉన్నాయి. ఇలాంటి టైమ్‌లో సాహోకు ఎద‌రుళ్ల‌డం అంటే పెద్ద డేంజ‌ర్‌ అన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తున్నాయి. ఇక సాహో టీజ‌ర్ 13న రిలీజ్ అవుతోంది. మ‌న్మ‌ధుడు 2 టీజ‌ర్ కూడా అదే రోజు వ‌దులుతున్నారు.

ఇక సినిమా రిలీజ్ డేట్ విష‌యంలోనూ నాగ్ దూకుడు మీదే ఉన్నాడు. సాహో ఆగ‌స్టు 15న వ‌స్తుంటే… మ‌న్మ‌థుడు 2 9వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. సాహోకి ఏస్ డిస్ట్రిబ్యూటర్లు, దిల్ రాజు, గీతా, యూవీ, ఏసియ‌న్‌ లాంటి సంస్థల బ్యాకింగ్ వుంది. నాగ్ కు కూడా థియేటర్ల సమస్య రాదు కానీ వారం తరువాత కలెక్షన్ల విషయంలో, థియేటర్ల విషయంలో సమస్య వచ్చే అవకాశం వుంది. కానీ నాగార్జున 9న విడుదలకే పట్టుదలగా వున్నారని తెలుస్తోంది. ఏదేమైనా సాహో ఎక్కువ థియేట‌ర్ల‌లో వ‌స్తుంది. సినిమాకు మంచి టాక్ వ‌స్తే మ‌న్మ‌థుడు 2 పూర్తిగా డ‌ల్ అవుతుంది. మ‌రి నాగ్ రిస్క్ ఏ మేర‌కు ఫ‌లిస్తుందో ? చూడాలి.

Leave a comment