బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా సంచలనానికి కేంద్ర బిందువుగా మారుతుంది. ఈ సినిమాకు ఇంత హైప్ క్రియేట్ అవడానికి ముఖ్య కారణం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి నటించడమే.. సినిమా ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకోగా మూడవ షెడ్యూల్ కు సన్నద్ధం అవుతుంది. ఇదిలాఉంటే ఈ సినిమాలో విలన్ ఎవరు.. వాళ్లతో చరణ్, ఎన్.టి.ఆర్ ఫైట్స్ ఎలా ఉంటాయంటే ఊహించినదానికన్నా ఎక్కువే ఉంటాయట.
ఇక ఇందులో ఎన్.టి.ఆర్ కొమరం భీం గా.. రాం చరణ్ అల్లూరి సీతారామరాజుగా ఇద్దరికిద్దరు పోటీ పడి నటిస్తున్నారట. ఇక్కడ అసలు ఫైట్ ఇద్దరి మధ్య జరుగుతుందట. ఓ సీన్ లో తారక్ సూపర్ అనిపిస్తే.. మరో సీన్ లో చరణ్ సర్ ప్రైజ్ చేస్తాడట. ఇలా ఇద్దరి హీరోలు సమపాళ్లలో అదరగొట్టేస్తారని తెలుస్తుంది. సినిమాలో ప్రేక్షకులు ఊహించని ఎన్నో సర్ ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి.
పక్కాగా చెప్పాలంటే తారక్, చరణ్ నువ్వా నేనా అన్నట్టుగా సినిమాలో నటిస్తున్నారట. ఇద్దరు స్నేహంగా ఉన్నా నటన విషయానికొచ్చేసరికి ఢీ అంటే ఢీ అనేలా ఉన్నారట. ఇక సినిమాలో ఒక హీరోయిన్ గా అలియా భట్ ఓకే అవగా సెకండ్ హీరోయిన్ పై రకరకాల వార్తలు వస్తున్నాయి. సినిమాలో అజయ్ దేవగన్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే.