గత ఏడాది కరిలీజైన మలయాళ మూవీ ‘ఒరు ఆధార్ లవ్’ టీజర్ ఓ సెన్సేషన్ అయ్యింది. ఓ సాంగ్ లో ప్రియావారియర్ తన ప్రియుడికి కన్ను కొట్టడం ఒక్కసారే సెన్సేషన్ అయ్యింది. అది క్యాజువల్ సీన్ అయినా..అప్పుడు అది ఓ ట్రెండ్ సృష్టించింది. దేశ వ్యాప్తంగా ఈ అమ్మడికి యూత్ మాత్రమే కాదు పెద్దలు కూడా ఫిదా అయ్యారు. దాంతో ప్రియాకు వరుసగా సినిమా, వాణిజ్య ప్రకటనలు చేసే ఛాన్సు దక్కింది. తనకు ఉన్న క్రేజ్ తో కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటించింది. కానీ సినిమాల్లో మాత్రం అంత త్వరగా ఒప్పుకోలేదు.
ఎందుకంటే తాను కన్నకొట్టినందుకే ఇంత క్రేజ్ వస్తే..తన సినిమా చూసి జనాలు ఏ రేంజ్ లో రియాక్ట్ అవుతారో అనుకున్నదట ఈ చిన్నది. ఈ క్రమంలో ఆమె తన క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకుంది. కోటి రూపాయలు తన రెమ్యునేషన్ గా కోట్ చేసింది. దాంతో అందరూ కంగారు పడ్డారు. ఓ కొత్త అమ్మాయి కు ఎప్పుడూ అంత పెద్ద మొత్తం ఇవ్వలేదని…చెప్పి చూసారు. అయినా ఆమె ఒప్పుకోలేదు. అయితే ఆమె నటించిన ‘లవర్స్ డే’ సినిమా విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు.. అందులో ప్రియా నటనపై విమర్శలు వినిపించాయి.
దీంతో ఆమె క్రేజ్ బాగా తగ్గింది. అప్పట్లో తమ సినిమాల్లో నటించమన్నవారు పక్కకు తప్పుకున్నారు. మొదట్లో కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఇరవై, పాతిక లక్షలకే సరిపెట్టుకుంటుంది. నిజానికి నితిన్ హీరోగా, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ ని అనుకున్నారు. అప్పట్లో కోటి రూపాయల్ ఆఫర్ చేశారు..కానీ ఒప్పుకోలేదు..ఇప్పుడు తప్పని పరిస్థితిలో ఈ ప్రాజెక్ట్ సైన్ చేసింది కానీ ఇరవై లక్షల రెమ్యునరేషన్ కే ఒప్పుకుంది.