బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత ప్రభాస్‌తో సినిమా చేయాలంటే బయట నిర్మాతలకు అందని ద్రాక్షగానే మిగిలి పోయేలా ఉంది. ప్రభాస్‌ను బయట బ్యానర్ వాళ్ళు తమకు సినిమా చేసి పెట్టాలని అడగటానికి సాహసం చేయలేక పోతున్నారు. ఎందుకంటే బాహుబలి సినిమాల తరువాత ప్రభాస్ మార్కెట్ రేంజ్ పెరిగిపోయింది. ప్రభాస్ ఇచ్చే రెమ్యూనరేషన్ తో పాటు ఆ సినిమాకి పెట్టే బడ్జెట్ కూడా ఓ సాధారణ నిర్మాత భరిస్తారా ? అన్న సందేహాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ ఆ మార్కెట్‌ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే సాహో సినిమాను తన సొంత బ్యానర్ అయిన యు.వి.క్రియేషన్స్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసమే రూ. 250 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో గతంలో ఓ సినిమాకు కమిట్ అవ్వడంతో వెంటనే ఆ సినిమా కూడా స్టార్ట్ అయింది…. కాబట్టి సరిపోయింది లేకపోతే సాహో తర్వాత మరింత గ్యాప్ వచ్చేది. రాధాకృష్ణ సినిమాకు జాన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే.
జాన్ తర్వాత ప్రభాస్ ఎట్టకేలకు బయట బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభాస్ ను సినిమా చేసేందుకు ఒప్పించిన ఆ నిర్మాత ఎవరో కాదు… టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ప్రభాస్ దిల్ రాజు చేతికి చిక్కిన తెలుస్తోంది. ఇటీవల ప్రభాస్ సాహో సినిమా రైట్స్ ప్రయత్నాల్లో భాగంగా ప్రభాస్‌కి ఓ స్క్రిఫ్ట్ వినిపించాడట.
ఈ స్క్రిప్ట్ డార్లింగ్ కు బాగా నచ్చడంతో ప్రభాస్ ఈ స్క్రిఫ్ట్‌తో సినిమా కచ్చితంగా చేద్దామని మాట ఇచ్చాడట. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మున్నా డిజాస్టర్ అయింది. ఆ సినిమా టైంలో ప్రభాస్ మార్కెట్ కేవలం 25 కోట్లకు కాస్త అటు ఇటుగా ఉంది. ఇప్పుడు అదే మార్కెట్ ఏకంగా రూ. 200 కోట్లకు చేరుకుంది. మరి ఈ కథకు దర్శకుడు ఎవరన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.