టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరి మహేష్ సత్తా ఏమిటో బాక్సాఫీస్‌కు మరోసారి చూపించింది. కాగా ఈ సినిమాపై రివ్యూవర్లు మిశ్రమ రివ్యూలు రాశారు. కాగా తెలుగు సినిమాలపై తనదైన శైలిలో విశ్లేషణ అందించే ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా మహర్షి సినిమాపై షాకింగ్ విశ్లేషణ అందించారు.
అందరూ అనుకున్నట్లుగా మహర్షి సినిమాలో పూర్తగా పాజిటివ్ అంశాలే కాకుండా చాలా తప్పులు దొర్లాయని ఆయన అన్నారు. మహర్షి సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ సినిమా నిడివి అని ఆయన అన్నారు. ఇక ఈ సినిమాలో సహజత్వానికి సింక్ కాని సీన్స్ కూడా చాలానే ఉన్నాయని ఆయన అన్నారు. అమెరికాలో ఒరిజిన్ కంపెనీ ఆఫీసును ఒక పల్లెటూరులో అది కూడా ఓ చెట్టు కింద పెట్టడం సహజత్వానికి చాలా దూరం అని.. అదే ఆఫీసును తన స్నేహితుడి ఇంట్లో పెట్టి ఉంటే ఇంకా బాగుండేది అని ఆయన అన్నారు.
మహర్షి సినిమా కథ ఒక చిన్న లైన్‌తో నడిచిందని.. స్నేహితుడి వల్ల జీవితం కాపాడబడ్డ హీరో ఆ విషయం చాలా ఆలస్యంగా తెలుసుకుంటాడు. ఈ మాత్రం స్టోరీలైన్ కోసం దర్శకుడు ఏదేదో తీశాడని ఆయన అన్నాడు. ముక్కు ఎక్కడ అంటే తల చుట్టూ తిప్పినట్లుగా స్క్రీన్‌ప్లే ఉందని ఆయన అన్నారు. అటు స్నేహితుడి పాత్రను కూడా ఇంకాస్త బెటర్‌గా చూపించాల్సింది అని ఆయన అన్నారు. ఏదేమైనా ప్రేక్షకుడికి సినిమా ఎప్పుడు ఎందుకు నచ్చుతుందో తెలియదని ఆయన తన విశ్లేషణను ముగించారు.