బోల్డ్ సీన్లతో ‘మన్మధుడు2’ టీజర్..!

టాలీవుడ్ లో రొమాంటిక్ హీరో నాగార్జున చాలా కాలం తర్వాత మళ్లీ రెచ్చిపోయారు. 60 ఏళ్ల ఆయన 25 ఏళ్ల కుర్రాడిలా అమ్మాయిలతో రెచ్చిపోయినట్లు ‘మన్మధుడు2’టీజర్ లో కనిపిస్తుంది. కుర్ర హీరోయిన్లతో కుర్ర హీరోలు కూడా ఈ రేంజ్ లో ఎప్పుడూ రెచ్చిపోలేదు.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటిస్తున్న ‘మన్మధుడు 2’టీజర్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయ్యింది. వైవిధ్యభరితమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో నాగార్జున సరసన నాయికలుగా రకుల్ – కీర్తి సురేశ్ నటిస్తున్నారు.

ఇక టీజర్ విషయానికి వస్తే.. ‘ఈ వయసులో మీకు పెళ్లేంటి సార్ .. ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తే మళ్లీ పూలు పూస్తాయా?’ అనే డైలాగ్ కడుపుబ్బా నవ్విస్తుంటే..నాగార్జున చేస్తున్న అల్లరిపనులు ఆకర్షిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మీ తో నాగార్జున్ ఫన్నీ సీన్లు బాగా నవ్విస్తున్నాయి.

హీరోయిన్లు రకూల్, కీర్తి సురేష్ తో నాగార్జున ముద్దు సీన్లలోరెచ్చిపోయారు. చాలాకాలం తరువాత నాగార్జున మళ్లీ రొమాంటిక్ హీరోగా విజృభించినట్టు ఈ టీజర్ బట్టి తెలిసిపోతోంది. ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Leave a comment