దక్షిణాదిలో చాలా మంది హీరోయిన్లు ఇంకా అమ్మకూచీలుగానే ఉన్నారు. తమ కుమార్తెలు హీరోయిన్లుగా నటిస్తుంటే వాళ్ల అమ్మలు సెట్స్‌లోనే ఉంటూ వారికి తోడుగా ఉంటుంటారు. ఇలాంటి హీరోయిన్ల విషయంలో కొన్ని సార్లు గొడవలు కూడా జరిగాయి. హీరోయిన్లు ఏ ముద్దుసీన్లోనో నటించాల్సి వస్తే వాళ్ల అమ్మలు పక్కనే ఉండడం.. అప్పుడు ఆ హీరోయిన్లు సరిగా నటించలేకపోవడం జరుగుతుండేది. మారుతి లాంటి డైరెక్టర్ల సినిమాల్లో ఒకటి రెండు సార్లు ఇలాంటి వివాదాలు వచ్చాయి.
ఇక షూటింగ్ స్టార్ట్ అయ్యి షూటింగ్ ముగిసేవరకు వీళ్ల పక్కనే అమ్మలు ఉంటారు. ఇది పక్కన ఉండే వాళ్లకు కూడా చాలా ఇబ్బంది అవుతోంది. ఇక ఇప్పుడు ఈ లిస్టులోకి నిన్నమొన్నటి వరకు హిట్లు లేకుండా టాలీవుడ్ ఐరెన్‌లెగ్‌గా ముద్ర వేసుకున్న మెహ్రీన్ చేరిపోయింది. రీసెంట్ గా ఎఫ్ 2 చిత్రంతో హిట్ కొట్టిన ఈ అమ్మడికి ఇప్పుడిప్పుడే కాసిన్ని మంచి ఛాన్సులు వస్తున్నాయి.
అయితే ప్రతి విషయంలోనూ మెహ్రీన్ అమ్మ జోక్యం ఎక్కువ అవ్వడంతో దర్శకులు, హీరోలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారట. అన్నట్టు ఈ అమ్మడు ఇటీవల రేటు కూడా పెంచేసింది. నాగశౌర్యతో చేసే సినిమాకు ఆమె ఏకంగా రూ.80 లక్షలు చార్జ్ చేస్తోంది. ఒక్క దెబ్బన మెహ్రీన్ రేటు రూ.30 లక్షలు పెరిగింది. ఇటీవల మేనేజర్‌ను తీసేసిన ఆమె ఇప్పుడు అన్ని బాధ్యతలు అమ్మ మీదే పెట్టడంతో… ఆమెకు ఛాన్సులు ఇచ్చే వాళ్లు కూడా వెనక్కు తగ్గుతారన్న టాక్ నడుస్తోంది.