కరిష్మా కపూర్ అంటే ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు… 1990వ దశకంలో ఆమె బాలీవుడ్లో స్టార్ హీరోయిన్. ఇంకా చెప్పాలంటే మాధురీ దీక్షిత్ లాంటి వాళ్లను తోసిరాజని కూడా ఆమె సూపర్ హిట్లు కొట్టి నెంబర్ వన్ పొజిషన్ ఎంజాయ్ చేసింది. కరిష్మా అంటే తెలియకపోయినా ఆమె సోదరి కరీనా కపూర్ గురించి చెప్పక్కర్లేదు. అక్కడ కరిష్మా రూట్లోనే హీరోయిన్ అయిన కరీనా సైఫ్ ఆలీఖాన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక కరిష్మా విషయానికి వస్తే ‘జిగర్’.. ‘రాజా హిందుస్తాని’.. ‘దిల్ తో పాగల్ హై’.. ‘హీరో నెం.1’.. ‘కూలీ నెం. 1′..’బీవి నెం. 1’.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె లిస్టులో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి. అమీర్‌ఖాన్ – గోవిందా – షారుఖ్‌ఖాన్ – సల్మాన్‌ఖాన్ లాంటి స్టార్ హీరోలతో ఆమె బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇచ్చింది. ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు కన్నాక విడాకులు తీసుకున్న ఆమె ఇప్పుడు ముంబైలో ఉంటోంది.
బుధవారం కరిష్మా కపూర్ 45 వ పుట్టిన రోజు. సీనియర్ అయినా ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతూ అందాలు వలకబోస్తోంది. పుట్టిన రోజు సందర్భంగా ఆమె బ్లాక్ బికినీలో బీచ్ రిసార్టులో పడుకుని ఆకాశంలోకి చూస్తూ ఒక కిరాక్ పోజిచ్చింది. ఆమెను చూసి వయస్సు ఎంత ఉంటుందో గెస్ చేయమని చెపితే కరిష్మా గురించి తెలియని వారు ఖచ్చితంగా 25కు కాస్త అటూ… ఇటూగా చెపుతారు.
అంత గ్లామర్‌గా ఆమె కనిపిస్తోంది. ఇంత వయస్సులో ఇంత ఫిట్నెస్సా అంటూ నెటిజన్లు ఆమె బికినీ అందాలకు ఫిదా అయిపోయి సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపించేస్తున్నారు. అన్నట్టు కరిష్మా ఓ వెబ్ సీరిస్‌లో నటించేందుకు రెడీ అవుతోంది. ఆమె బికిని అందాలపై మీరు కూడా ఓ లుక్కేయండి.