టాలీవుడ్‌లో ఈ శుక్రరవారం మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు సినిమాల్లో సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి చిత్రం తో పాటుగా నివేదా థామస్ – శ్రీవిష్ణు నటించిన బ్రోచేవారెవరురా, కెప్టెన్ రానా ప్రతాప్ చిత్రాలు విడుదల అయ్యాయి. వీటిల్లో కల్కి, బ్రోచేవారెవరురా సినిమాపై సరి సమానంగా అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా టీజర్, ట్రైలర్ లతో ఆకట్టుకున్నాయి. దాంతో ఈ రెండు సినిమాలపై అంచనాలు నెలకొన్నాయి .
ఇక ఈ రెండు సినిమాల్లో రాజశేఖర్ కల్కి విషయానికి వస్తే గరుడవేగ తర్వాత రాజశేఖర్ నటించిన సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కల్కి కేవలం సెకండాఫ్ మాత్రమే బాగుందన్న టాక్ వచ్చింది. ఫస్టాఫ్ మరీ స్లోగా ఉందని.. స్క్రీన్ ప్లే కన్‌ఫ్యూజింగ్‌గా ఉండడంతో పాటు చాలా స్లోగా ఉందంటున్నారు. 2.20 నిమిషాల నిడివి ఉన్న సినిమాల్లో చివరి అరగంట మినహా మిగిలిన సినిమా అంతా సాగదీశారని అంటున్నారు. ఫస్టాఫ్‌లో కాస్త చికాకు కలిగించినా.. సెకండాఫ్‌తో పర్వాలేదనిపించేలా కల్కి ఉందంటున్నారు. ఓవరాల్‌గా కల్కికేవలం పర్వాలేదనిపించే చిత్రం మాత్రమే.
ఇక శ్రీ విష్ణు, నివేదా థామస్, నివేత పేతురాజ్, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రోచేవారెవరురా కామెడీ క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిందన్న టాక్ వచ్చింది. సినిమా సరదా సరదాగా సాగుతూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో అందరిని ఆకట్టుకుందట. సినిమా బాగున్నా కొన్ని చోట్ల నెరేషన్ బాగా స్లోగా ఉందంటున్నారు. ఓవరాల్‌గా కల్కితో పోలిస్తే ఈ సినిమాకే టాక్ బాగుంది. ఎక్కువ రేటింగ్స్ పడుతున్నాయి. మంచి కమర్షియల్ మూవీగా కూడా బ్రోచేవారెవరురా నిలుస్తుందంటున్నారు.