కమెడియన్‌గా పిచ్చ ఫామ్‌లో ఉండగానే హీరోయిజం చూపించాలని హీరోగా మారాడు సునీల్. కమెడియన్ వేషాలకు బైబై చెప్పేసిన మనోడు అందాల రాముడు సినిమా హిట్ అవ్వడంతో ఇక కామెడీ రోల్స్ నా కెందుకు… నేను హీరోను అన్నట్టుగా వ్యవహరించాడు. రాజమౌళి మర్యాదరామన్న సినిమాతో ఇంకాస్త క్రేజ్ తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత ఒకటి రెండు హిట్లు వచ్చాయి. అక్కడ నుంచి వరుస ప్లాపులతో సునీల్ కెరీర్ పరంగా ఘోరంగా దెబ్బతిన్నాడు. ఒకానొక దశలో సునీల్ వరుసపెట్టి ఏకంగా ఏడుప్లాపు సినిమాలు ఇచ్చాడు. మనోడి సినిమా అంటే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లే కాదు చివరకు శాటిలైట్ రైట్స్ కొనేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాక పారిపోయే పరిస్థితి.
హీరోయిజం వర్కౌట్ కాక మళ్ళీ కమెడియన్ అవతారం ఎత్తాడు. కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చాక సునీల్ చేసిన సినిమాల్లో అరవింద సమేత లాంటి సినిమా తప్పా అన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. వెన్నెల కిషోర్ ఇప్పుడు టాప్‌లోకి వెళ్లిపోయాడు. ప్రభాస్ సాహో సినిమాలో వెన్నెల కిషోర్ కీ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక జబర్దస్త్ పుణ్యమా అని రోజుకో కమెడియన్ సినిమాల్లోకి వచ్చేస్తున్నాడు. దీంతో ఇప్పుడు సునీల్‌ను కనీసం కమెడియన్‌గా కూడా పెట్టుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు.
ఒకప్పుడు స్టార్ హీరోలకు సైతం కమెడియన్‌గా బెస్ట్ ఆప్షన్‌గా ఉన్న సునీల్ నేడు ఐరెన్ లెగ్ మాదిరిగా కనబడుతున్నాడు. ఇప్పుడు సునీల్ వేసే పంచ్‌లు ఏ మాత్రం పేలడం లేదు. టాలీవుడ్ సీనియర్లే కాదు జూనియర్లు కూడా సునీల్ మా సినిమాల్లో వద్దే వద్దని… అవసరమైతే తమమీదే స్పెషల్ కామెడీ ట్రాక్ ఉండేలా ప్లాన్ చేయమని దర్శకులకు ముందే చెప్పేస్తున్నారట.