డబ్బులు పెట్టేందుకు నాన్న వెనుకాడడు… వాళ్ళ కుటుంబం ఓ బడా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. తండ్రి తెలుగుదేశం పార్టీ ఎంపీ… నాయనమ్మ మాజీ మంత్రి… బలమైన రాజకీయ వారసత్వం. ఇటు మేనమామ టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో… ఎన్ని పాజిటివ్ అంశాలు పెట్టుకుని కూడా ఇప్పుడు అతడు వెండితెరంగ్రేటం చేసేందుకు ఓ ప్లాప్ డైరెక్టర్‌ను ఎంచుకోవడం పెద్ద షాకింగ్ న్యూస్ గా మారింది. కొద్ది రోజులుగా సరైన లాంచింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న గుంటూరు టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ డెబ్యూ మూవీకి భలే మంచి రోజు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తారని వార్తలు వస్తున్నాయి.
గతంలో గల్లా అశోక్ సినిమా కోసం టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు అశోక్‌తో ఓ ట్రైల్ వేశారు. ఆ తర్వాత ఆయన కృష్ణారెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా కూడా స్టార్ట్ చేసి మధ్యలో వదిలేశారు. దీనికి ప్రధాన కారణం గల్లా అశోక్ నటన చూసి దిల్ రాజు పెదవి విరచడమే అని అప్పట్లో ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. మధ్యలో అశోక్ కొన్ని రోజులు మేనమామ మహేష్‌బాబు సినిమాలకు అశోక్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. ఇక ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య విషయానికి వస్తే భలే మంచి రోజు ఓ డిఫరెంట్ సినిమా. ప్చ్ లాభాలేం రాలేదు.
ఇక శమంతకమణి ఓ ఫ్లాపు సినిమా. నిర్మాతలకు నష్టాలే. ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రయత్నంలో అశోక్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. పైన చెప్పుకున్న సానుకూలతలు ఉండి కూడా అశోక్ తన డెబ్యూ మూవీ కోసం ఇలాంటి ప్లాప్ డైరెక్టర్‌ను ఎందుకు తీసుకున్నాడో ? కూడా అర్థంకాని పరిస్థితి. ఈ సినిమాను ఇప్పుడు దిల్ రాజు చేపట్టే పరిస్థితి అయితే లేదట. మరి ఈ సినిమాకు నిర్మాత ఎవరో ? అశోక్ డెబ్యూ మూవీ సక్సెస్ అవుతుందో ? లేదో ? కాలమే సమాధానం ఇవ్వాలి.