మరీ ఇంత చీఫ్ ట్రిక్స్ అవసరమా..?

ఈ మద్య ఒక సినిమా ప్రమోషన్ కోసం ముహూర్తం షాట్ నుంచి మూవీ రిలీజ్ అయ్యే వరకు రక రకాల ట్రిక్కులు.. జిమ్మిక్కులు.. ప్రమోషన్ వర్కులు చేస్తున్నారు. తమ సినిమా షూటింగ్ స్పాట్ ఫోటోలు లీక్ చేశారని..లొకేషన్ కి సంబంధించిన వీడియోలు లీక్ అవుతున్నాయని సోషల్ మీడియా సాక్షింగా నానా రాద్దాంతం చేస్తున్నారు చిత్ర యూనిట్. వాస్తవానికి ఇలాంటి లీకేజీలు జరుగుతున్నా వాటిని తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు.

తాజాగా రామ్ హీరోగా నటించిన ” ఇస్మార్ట్ శంకర్ ” అనే మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ బాగా ఉన్నాయని..కొన్ని డైలాగ్స్ అభ్యంతర కరంగా ఉన్నాయని కాంప్లెంట్స్ వచ్చాయి. కాగా, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈమూవీ జూలై 12 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇంతలోనే ఈ సినిమా స్టోరీ లీక్ అయ్యిందని నానా హంగామా చేశారు దర్శకులు, నిర్మాత పూరి జగన్నాధ్, ఛార్మి. అంతే కాదే మా ఇస్మార్ట్ శంకర్ స్క్రిప్ట్ మొత్తం ఆన్ లైన్ లో లీకయ్యింది అంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కట్ చేస్తే మా సినిమా స్క్రిప్ట్ ఎవరూ కాపీ కొట్టలేదు , సోషల్ మీడియాలో పెట్టలేదు..అదంతా ఉత్తిదే..అంటూ తేల్చేశారు. దాంతో సినిమా కోసం మరీ ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేయాలా అంటున్నారు నెటిజన్లు.

Leave a comment