Moviesపవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు చేదు వార్త..!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు చేదు వార్త..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు చేఉవార్త ఇది.. అదేంటి జనసేన పెట్టి ఏపిలో ఘోర పరాజయం పొందిన దాని కన్నా ఇంకేం చేదు వార్త ఉంటుందని అనుకోవచ్చు. రాజకీయల్లో ఇంకా ఓనమాలు నేర్చుకునే దశలోనే ఉన్న పవన్ కు మొదటి షాక్ తగిలినట్టే. అయితే ఎలాగు పాలిటిక్స్ లో ఫెయిల్ అయ్యాడు కదా తనకు వచ్చిన సినిమాలు చేస్తాడని అనుకున్నారు ఫ్యాన్స్. అప్పుడప్పుడు మీటింగ్స్ లో ఖాళీగా ఉండటం కన్నా సినిమాలు చేయడం బెటర్ అని పవన్ కూడా అన్నాడు.

పవన్ ఓటమి ఎవరికి ఎలా ఉన్నా తనకు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతల ముఖాలు మాత్రం వెలిగిపోయేలా చేసింది. ఇదిలాఉంటే నేడో రేపో మళ్లీ క్లీన్ షేవ్ చేసుకుని కెమెరా ముందుకు రావడమే లేటని అనుకున్నారు. కట్ చేస్తే మళ్లీ ప్లాన్ చేంజ్ చేశాడు పవన్ కళ్యాణ్. ఓడిపోతే సినిమాలు చేస్తాడని అనుకున్న ఫ్యాన్స్ కు షాక్ ఇస్తూ ఇప్పుడప్పుడే సినిమాలు చేసే ఉద్దేశం లేదన్నట్టు సన్నిహితులతో చెబుతున్నాడట.

పవన్ తో సినిమాకు దర్శక నిర్మాతల వెయిటింగ్ తెలిసిందే. పవన్ ఓ నెల రోజులు కేటాయించినా సరే సినిమా చేసేద్దాం అనుకుంటున్న వారు ఉన్నారు. కాని పవన్ ఆలోచన వేరేలా ఉంది. ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన జనసేన పార్టీ తర్వాత విధి విధానాల మీద ఓ గట్టి నిర్ణయం తీసుకోనున్నారట. దాని కోసం సినిమాలను కూడా పక్కన పెట్టనున్నాడట. సినిమాలైతే చేసే అవకాశం ఉన్నా అది ఎప్పుడన్నది మాత్రం చెప్పలేం అంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news