Gossipsఅఖిల్‌కు అన్న ల‌వ‌రే గ‌తి అయ్యిందా...

అఖిల్‌కు అన్న ల‌వ‌రే గ‌తి అయ్యిందా…

టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన తొలి నాళ్లలో పూజా హెగ్డేను ఏ హీరో పట్టించుకున్న దాఖలాలు లేవు. వరుణ్ తేజ్‌తో చేసిన ముకుంద – నాగచైతన్యతో చేసిన ఒక లైలా కోసం సినిమాలు పెద్దగా ఆడలేదు. అప్పట్లో ఆమెకు అవకాశం రావడమే అదృష్టం అన్నట్లుగా ఉండేది. ఐదేళ్ల తర్వాత సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు వరుస పెట్టి సీనియర్ హీరోలు మొదలు జూనియర్ వరకు అందరూ తమ సినిమాల్లో ఆమె కావాలని…. ఆమెతోనే రొమాన్స్ చేస్తామని… రెమ్యున‌రేష‌న్‌ ఎంతైనా పట్టించుకోవద్దని నిర్మాతలకు, దర్శకులకు తెగేసి చెప్తున్నారట.

ఇప్పటికే ఎన్టీఆర్‌తో అరవింద సమేత, మహేష్ బాబు తో మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న పూజ అల్లు అర్జున్ – ప్రభాస్ – వరుణ్ తేజ్ సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే అక్కినేని నాగార్జున రెండో వారసుడు అక్కినేని అఖిల్‌ వరుసపెట్టి ప్లాపుల‌ మీద ఫ్లాపులు ఇస్తున్నాడు. చాలా గ్రాండ్‌గా టాలీవుడ్ లో లాంచ్ అయిన‌ అఖిల్ తొలి మూడు సినిమాలతోనే మూడు డిజాస్ట‌ర్లు ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న 4వ సినిమా అతడి కెరీర్ కే అగ్నిపరీక్షగా మారింది.

ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే అఖిల్ దుకాణం బంద్ చేసుకోవచ్చన్న విమర్శలు వచ్చేస్తున్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. వాస్తవానికి నెల రోజుల ముందు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళాల్సి ఉంది. అఖిల్ కు సరిపడా జోడీ కోసం దర్శక, నిర్మాతలు నెలరోజులుగా వెతుకుతూనే ఉన్నారు. చివరికి అటు తిరిగి ఇటు తిరిగి పూజ హెగ్డేను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఎట్టి పరిస్థితుల్లో సినిమా ఉన్న నేపథ్యంలో పూజాహెగ్డే తీసుకుంటే సినిమాకు కాస్త బిజినెస్ సర్కిల్స్ లో క్రేజ్ వస్తుందని ఆమె పేరును పరిశీలిస్తున్నారట. ఇక గతంలో అఖిల్ అన్న చైతుకు ఒక లైలా కోసం లాంటి బిలో యావ‌రేజ్ సినిమా ఇచ్చిన పూజ ఇప్పుడు తమ్ముడు తలరాతను ఎలా ? మారుస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news