మామకు ముహూర్తం పెట్టిన అల్లుడు!

ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ ఇటీవల ‘ఎఫ్2’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి వెంకటేష్ కెరీర్‌లో అదిరిపోయే హిట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమాతో బూస్ట్ తెచ్చుకున్న వెంకటేష్ ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెట్టాడు.

తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి వెంకీ మామ అనే సినిమాలో నటిస్తున్నాడు వెంకటేష్. చైతూ కూడా మజిలీ సినిమాతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వెంకీ మామ సినిమా వస్తుండటంతో ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 13న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం అక్టోబర్ 2న రిలీజ్ కానుండటంతో ఈ సినిమాను సెప్టెంబర్‌లోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారు.

పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌‌గా తెరకెక్కుతున్న వెంకీ మామలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పూత్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. చైతు పక్కన రాశి ఖన్నా యాక్ట్ చేస్తోంది. మరి ఈ మామా అల్లుళ్లు ఎలాంటి సక్సెస్ కొడతారో అని ఇండస్ట్రీ జనాలు ఆసక్తిగా చూస్తున్నారు.

Leave a comment