తేజ ‘సీత’ మూవీ రివ్యూ & రేటింగ్

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా తెరకెక్కిన సీత చిత్రం మొదట్నుంచీ మంచి అంచనాలు క్రియేట్ చేస్తూ వచ్చింది. దర్శకుడు తేజ డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో అన్ని వర్గాల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మంచి ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా చేసిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతమేర అందుకుందో రివ్యూలో చూద్దాం.
3
కథ:
స్వార్ధపరురాలైన బిజినెస్ వుమెన్ సీత(కాజల్) లోకల్ ఎమ్మెల్యే బసవ(సోనూసూద్)తో ఓ భారీ డీల్ కుదుర్చుకుంటుంది. దాని తాలుకా డబ్బులు వసూలు చేసేందుకు అమాయకుడైన రఘురామ్(బెల్లంకొండ శ్రీనివాస్)ను తెలివిగా వాడుకుంటుంది. అయితే ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ ఎలా చిగురుస్తోంది..? సీత తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందా..? ఆమె స్వార్ధం కోసం రఘురామ్‌ను ఎలా వాడుకుంది..? బసవ నుండి సీతను రఘురామ్ ఎలా కాపాడాడు..? అనే కథను తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:
ఒక మోడ్రన్ మహిళ మైండ్‌సెట్ ఎలా ఉంటుందో అనే అంశంపై సీత చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు తేజ. తాను రాసుకున్న సీత కథ నేటితరం మహిళ ఆలోచనలను మనకు అద్దంలా చూపించాడు. ఇక సినిమా కథ పరంగా ఫస్టాఫ్‌లో ఒక అల్ట్రా మోడ్రన్ మహిళ మైండ్‌సెట్‌ ఎలా ఉంటుందో సీత పాత్రను చూస్తే అర్ధమవుతుంది. తన స్వార్ధం కోసం.. తాను అనుకున్న లక్ష్యాలను చేరేందుకు ఎలాంటి ఎమోషన్స్‌కు తావివ్వకుండా సీత పాత్రను తీర్చాడు తేజ. బిజినెస్ పరంగా బసవతో డీల్ కుదుర్చుకోవడం.. వారిమధ్య విభేదాలు రావడంతో బసవ తనకు ఇవ్వాల్సిన డబ్బులను రఘురామ్ ద్వారా పొందాలని చూస్తుంది సీత. అయితే రఘురామ్ సీతను నిస్వార్ధంగా ప్రేమిస్తాడు.
2
ఇక సెకండాఫ్‌లో రఘురామ్ క్యారెక్టర్‌కు సీత కనెక్ట్ అయ్యే అంశాన్ని తేజ సరికొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. అక్కడక్కడా కొన్ని ల్యాగ్ సీన్లు ప్రేక్షకులను విసిగెత్తిస్తాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ చాలా బెటర్ అని చెప్పాలి. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌లలో వచ్చే ట్విస్ట్‌లు సినిమాకు పూర్తి న్యాయం చేస్తాయి. ఓవరాల్‌గా సీత ఒక చక్కటి ఎంటర్‌టైనర్ చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమాలో మేజర్ అసెట్ ఏమైనా ఉందంటే అది ఖచ్చితంగా కాజల్ అనే చెప్పాలి. దర్శకుడు తేజ తాను రాసుకున్న కథను పరిధి మేర బాగా చూపించాడు. కొన్ని బోరింగ్ సీన్స్, బెల్లంకొండ బాబు పెట్టే టార్చర్‌ మినహా సీత మూవీని ఈ వీకెండ్‌లో తప్పకుండా చూడవచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్:
‘సీత’ అనే లేడీ ఓరియెంటెడ్ టైటిల్‌లో వచ్చిన సినిమాలో హీరోయిన్ కాజల్ పూర్తి సినిమాలో తన మార్క్ వదిలింది. స్వార్ధపరురాలైన ఒక మోడ్రన్ అమ్మాయిగా కాజల్ పర్ఫార్మెన్స్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. తేజతో ముచ్టగా మూడోసారి జతకట్టిన ఈ చందమామ ఆడియెన్స్‌ను తనవైపు తిప్పుకుంది. ఇక మన బెల్లంకొండ బాబు ప్రతి సినిమాలోలాగే ఈ సినిమాలో కూడా అదే రొటీన్ యాక్టింగ్‌తో టార్చర్ పెట్టించాడు. అయితే ఈ సినిమాలో ఫైట్లు కాస్త తక్కువగా ఉండటంతో ఆడియెన్స్ బతికి బట్టకట్టారు. బసవ పాత్రలో సోనూసూద్ ఇరగ్గొట్టాడు. మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు.
1
టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు తేజ నేనే రాజు నేనే మంత్రి చిత్రం తరువాత తన సక్సెస్ ట్రాక్‌ను కొనసాగింపుగా సీత అనే టైటిల్‌తో మనముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాను పూర్తి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించే దిశలో కొన్నిచోట్లా తేజ ఫెయిల్ అయ్యాడు. ముఖ్యంగా కొన్ని సీన్స్ ల్యాగింగ్ కావడంతో సినిమాకు మైనస్ అయ్యింది. శిరీష రే సినిమాటోగ్రఫీ బాగుంది. అనూప్ రూబెన్స్ సంగీతం పర్వాలేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంది.

చివరగా:
సీత – ఆడియెన్స్‌కు పెద్ద రోత(కొందరికీ మాత్రమే)

రేటింగ్: 2.25/5

Leave a comment