టాలీవుడ్ లోకి ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సమంత. ఆ సినిమా హీరో అక్కినేని నాగ చైతన్య తో నిజంగానే లవ్ లో పడిపోయింది. కొంత కాలం డేటింగ్ తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన మూడు నెలల తర్వాత సినిమాల్లో బిజీ అయ్యారు చైతూ-సమ్ము. అక్కినేని ఫ్యామిలీ అంటే టాలీవుడ్ ఎంతో గొప్ప పేరు ఉన్న విషయం తెలిసిందే. అలాంటి ఫ్యామిలీకి ఇప్పుడు పెద్దకోడలిగా సమంతపై ఎన్నో బాధ్యతలు ఉన్నాయి.
ఇక ఇప్పటి వరకు తన తల్లితండ్రులతో కలిసున్న సందర్భాన్ని కానీ, వారితో పంచుకున్న క్షణాల్ని కానీ, కనీసం చైతు సామ్ పెళ్ళిలో సమంత పేరెంట్స్ ఉన్నట్లుగా ఎవరికీ తెలియదు. ఏ ఈవెంట్ వచ్చినా తనకు దగ్గరవారైన అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీల తోనే ఎక్కువగా గడిపింది. చాలారోజులనుండి సమంత తల్లితండ్రులతో సమంతకి ఏవో విభేదాలున్నాయని న్యూస్ ప్రచారంలోఉంది. సమంత అందుకే తన పేరెంట్స్ విషయాలేమి బయటికి పొక్కకుండా గుంభనంగా ఉంటుందని అంటారు.
కాగా, గత కొంత కాలంగా వస్తున్న ఇలాంటి రూమర్లకు మదర్స్ డే రోజున చెక్ పెట్టింది సమంత. తన ఇన్ స్ట్రాగ్రామ్ లో తన తల్లి ఫోటో షేర్ చేసింది. అంతే కాదు తన తల్లి దేవుణ్ణి ప్రార్థించడం నా చిన్నప్పటి చూస్తున్నానని.. తన తల్లి చేసే ప్రార్ధనలో ఏదో మాయ ఉంటుందని.. ఇక ఇప్పుడు కూడా తన కోసం తన తల్లిని దేవుణ్ణి ప్రార్ధించమని అడుగుతానని అన్నారు. దీని బట్టి సమంత కి తన పేరెంట్స్ కి మధ్యన విభేదాలేమి లేవనిపిస్తుంది. కావాలనే వారు కాస్త ప్రవేట్ లైఫ్ ని కోరుకుంటున్నట్లుగా అనిపిస్తుంది.