ప్రభాస్‌కు దెబ్బేసిన ముగ్గురు.. ఎవరో తెలిస్తే షాకే!

బాహుబలి హీరో ప్రభాస్ నటిస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘సాహో’ మెజారిటీ షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుని చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమాను ఆగస్టు నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ అప్పుడెప్పుడో రెడీ అయ్యారు. ఈ సినిమాకు ప్రతి అంశం పవర్‌ఫుల్‌గా ఉండాలని దర్శకుడు సుజీత్ భావిస్తున్నాడు. అందుకే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి న్యూస్‌ను కూడా జనాల్లోకి రానివ్వలేదు.

ఇటీవల ప్రభాస్ వరుసబెట్టి ఈ చిత్ర పోస్టర్లు రిలీజ్ చేస్తూ ఆడియెన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ వస్తున్నాడు. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ విషయాన్ని ఆ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్స్ తెలిపారు. సాహో చిత్రానికి సంగీతం అందిస్తున్న మ్యూజిక్ త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ ఈ చిత్రం నుండి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అసలే ప్రెస్టీజీయస్ మూవీ.. రిలీజ్‌కు మరికొన్ని నెలలు మాత్రమే ఉండగా ఇలా మ్యూజిక్ డైరెక్టర్స్ మూవీ నుండి వాకౌట్ చేయడమేమిటని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలైంది.

ఏదేమైనా ఈ షాకింగ్ విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో తుఫాను క్రియేట్ చేస్తోంది. అసలే ఆలస్యమవుతున్న సాహో రిలీజ్ ఇప్పుడు వీరి దెబ్బకు మరింత ఆలస్యం కానుందని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఏదేమైనా ప్రభాస్‌కు ఆ ముగ్గురు కలిసి బాగా దెబ్బేశారని అంటున్నారు ఆయన ఫ్యాన్స్.

Leave a comment