Gossipsఆర్ ఆర్ ఆర్ కు 'దెబ్బ' మీద 'దెబ్బలు'..?

ఆర్ ఆర్ ఆర్ కు ‘దెబ్బ’ మీద ‘దెబ్బలు’..?

దర్శక బాహుబలి ఒక వైపు. తెలుగు ఫిల్మ్ ఇండ్రస్ట్రీలో యంగ్ అండ్ టాప్ క్రేజీ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ మరో వైపు. ఈ కాంబినేషన్ లో సినిమా అంటే మాములుగా ఉంటుందా ? అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతాయి. ఈ టాప్ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉండబోతుంది ? స్టోరీ ఏంటి ఇలా సవాలక్ష ప్రశ్నలు అభిమానుల మెదడులో మెదిలిపోతుంటాయి. అసలు ఈ చిత్రానికి ఆర్ ఆర్ ఆర్ అని టైటిల్ పెట్టడం వెనుక రహస్యం ఏంటో తెలియక జుట్టు పీక్కుంటున్నారు.

ఇక విషయానికి వస్తే ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ మొదలయినప్పటి నుంచి ఏదో ఒక అపశకునం ఈ సినిమాను పట్టి పీడిస్తోంది. తరుచు ఈ సినిమా షూటింగ్స్ లో ఎవరో ఒకరు గాయపడడం, దీని కారణంగా అనేక షెడ్యూళ్లు వాయిదాలపై వాయిదా పడుతున్నాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ గాయం కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మరికొన్నాళ్లు వాయిదా వేయడంతో మరోసారి చర్చకు తెరలేచింది.

ఈ సినిమా హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకోవడం కథ మొదటికి వచ్చింది. వాస్తవానికి ఎన్టీఆర్ సరసన డైసీ నటించాల్సింది. కానీ కుటుంబ కారణాలు చూపుతూ సినిమా నుంచి నిష్క్రమించడంతో మొదటి దెబ్బ తగిలింది. ఆ తరువాత గుజరాత్‌లో షూటింగ్ జరుగుతుండగా ఈ చిత్ర హీరో రామ్ చరణ్ కాలికి గాయం కావడంతో షెడ్యూల్‌ వాయిదా పాడడం మరో దెబ్బ తగిలినట్టయ్యింది.

రాంచరణ్ కోలుకోవడంతో హైదరాబాద్ లో షూటింగ్ ప్లాన్ చేశారు. ఆ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతుండగా ఎన్టీఆర్ గాయపడటంతో మూడో దెబ్బ గట్టిగానే తగిలింది. అయితే ఎన్టీఆర్ గాయాన్ని బయటకి పొక్కకుండా ఆ చిత్ర యూనిట్ జాగ్రత్తపడినా ఆయన ఆ గాయానికి చికిత్స కోసం హాస్పిటల్ కి వెళ్లడం అక్కడ ఫొటోస్ మీడియాకు చిక్కడంతో ఆ విషయం బయటకి పొక్కింది. అయితే ఎన్టీఆర్ కి ఆ దెబ్బలు ఎక్కడ తగిలాయి ? ఇంట్లోనా లేక షూటింగ్ లోనా అనే అనుమానాలకు క్లారిటీ రాలేదు.

ఇలా వరుసగా గాయాల సమస్య వేధించడం ఆర్ ఆర్ ఆర్ సినిమాపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. అదీ కాకుండా ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు కూడా నటిస్తుండడం, వరుస వరుసగా షూటింగ్ వాయిదా పడడంతో కాల్షీట్స్ ప్రాబ్లెమ్ కూడా చికాకు తెప్పిస్తోందట. అయితే ఈ సమస్యలన్నీ అధిగమించి షూటింగ్ ఎప్పుడు పూర్తి చేసుకుంటుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news