తమిళ ఆఫర్లకు సై అంటున్న లేడీ కామ్రేడ్..

యంగ్ హీరో నాగశౌర్య కెరీర్ బెస్ట్ మూవీ ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మికా మందన్నా ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. విజయ్ దేవరకొండతో ‘గీత గోవిందం’ సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం మరోసారి తమ కాంబోను రిపీట్ చేస్తోంది. డియర్ కామ్రేడ్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది రష్మిక.

అయితే అమ్మడు తమిళ ఆఫర్లకు కూడా ఓకే చెబుతోంది. ఇప్పటికే కార్తీ హీరోగా రాబోయే ఓ సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయిన రష్మిక తమిళ స్టార్ హీరో విజయ సరసన నటించేందుకు సిద్ధమవుతోంది. దీని కోసం ఆ చిత్ర దర్శకనిర్మాతల రష్మికను ఒప్పించే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఇక వరుసగా తమిళంలో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్లకు ఎసరు పెట్టేందుకు ఈ బ్యూటీ ఛలో అంటూ దూసుకుపోతోంది.

ఇటు తెలుగులోనూ అమ్మడి క్రేజ్ మామూలుగా లేదు. స్టార్ హీరోలైన అల్లు అర్జున్, మహేష్ బాబులతో పాటు నితిన్‌లతో కలిసి జత కట్టేందుకు రష్మికా రెడీ అయ్యింది. మరి ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న రష్మిక కెరీర్‌లో సక్సెస్‌లు ఏ విధంగా దూసుకుపోతాయో చూడాలి.

Leave a comment