రాళ్లపల్లి మృతి వెనుక అసలు రహస్యం..?

ప్రముఖ కమెడీయన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాళ్లపల్లి గత రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. 90వ దశకంలో ఆయన ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. రాళ్లపల్లి, రావు గోపాలరావు, నూతన్ ప్రసాద్ కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి..హిట్ అయ్యాయి. వెండితెరపై తానేంటే ప్రూవ్ చేసుకున్న రాళ్లపల్లి కొంత కాలం క్రితం బుల్లితెరపై నటించారు. 73 ఏళ్ల వయసులో ఉన్న ఈ సీనియర్ నటుడు గత ఏడాది వరకు పలు సీరియల్స్ అలాగే టీవీ షోల్లో నటించారు. కే. ప్రత్యగాత్మ దర్శకత్వం వహించిన”స్త్రీ ” (1973) నటుడి గా రాళ్ళపల్లి తొలి చిత్రం.

ఉరుమ్మడి బ్రతుకులు (1976) సినిమా ఆయన కెరీర్‌ మలుపుతిప్పింది. ఈ సినిమాకు నంది అవార్డ్‌ అందుకున్నారు. ఆ తరువాత చిల్లర దేవుళ్ళు, చలిచీ మలు సినిమాలు గుర్తింపు తెచ్చాయి. 1979లో ‘కుక్కకాటుకు చెప్పుదెబ్బ’తో నటిడుగా పేరు తెచ్చుకున్నారు. దాదాపు 850కు పైగా చిత్రాల్లో నటించిన రాళ్ళపల్లి పలు అవార్డులను కూడా అందుకున్నారు. ఆయన పూర్తీ పేరు రాళ్ళపల్లి వెంకట నరసింహారావు. 1945లో ఆంధ్రప్రదేశ్ కంబదూర్ లో జన్మించిన ఆయన చిన్న వయసులోనే నాటకాల పట్ల ఆసక్తి చూపించారు. జ్యోతిష్కుడు, హిజ్రా, యానాది, పోలీస్‌, నావికుడు, ఇంట్లో పనివాడిగా తోట మాలిగా.. ఇలా ఏ పాత్రనైనా సరే అవలీలగా పోషించగలిగిన సహజ నటుడు.

ఖైదీ – అభిలాషా -అన్వేషణ – అహనా పెళ్ళంట – అగ్ని పుత్రుడు – కూలీ నెంబర్ వన్ – బొంబాయి – ఘటోత్కచూడు- కలిసుందాం రా – నువ్వు నేను – అవునన్నా కాదన్న – వంటి ఎన్నో సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఆ మద్యనాని నటించిన భలే భలే మగాడివోయ్ సినిమాలో నటించారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని..అందుకే వెండి తెర, బుల్లితెరకు దూరమయ్యారని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. రాళ్ళపల్లి మృతిపట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు రాజయాకియ నాయకులూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment