నూతన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ‘ఆర్ఎక్స్ 100’రూపొందింది. ఈ సినిమా తో బోజ్ పూరి హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పూత్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. బోల్డ్ కంటెంట్ తో ఉన్న ఈ మూవీలో హాట్ హాట్ గా నటించి సంచనలం సృష్టించింది ఉత్తరాది భామ పాయల్ రాజ్‌పుత్. ఆ సినిమా ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గుర్తింపు సంపాదించిన పాయల్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సరైన కథలు మాత్రమే ఎంచుకుంటానని..ఎలాంటి పాత్రలైనా చేయడానికి..స్కిన్ షో చేయడానికి ఏమాత్రం వెనుకాడనని అంటుంది. `ఆర్ఎక్స్100` సినిమా కథను చాలా మంది హీరోయిన్లకు వినిపించారట. వారెవరూ ఆ సినిమా చేసేందుకు అంగీకరించలేదట..ఎందుకంటే అది నెగిటీవ్ పాత్ర..అందులోనూ చాలా హాట్ గా నటించాలి. కానీ నేను ఏమాత్రం ఆలోచించలేదు..ఎందుకంటే ప్రస్తుతం సమాజంలోనూ జరుగుతున్నాయి. నేను చేయబోయే సినిమాలో నా పాత్ర చాలా బోల్డ్‌గా ఉంటుందని ఇంట్లో చెప్పాను. అమ్మానాన్నా మొదట అభ్యంతర పెట్టినా తర్వాత అంగీకరించారు.
ప్రస్తుతం పాయల్ కి బాగా డిమాండ్ పెరిగిపోయింది. మొదటి సినిమాకి 3లక్షల పారితోషికం అందుకున్న ఓ యంగ్ హాట్ బ్యూటీ, మొదటి సినిమా సూపర్ హిట్ అయ్యేసరికి రెండో సినిమాకి ఏకంగా 40 -45 లక్షలు డిమాండ్ చేస్తోంది. తాజాగా నందమూరి బాలయ్య- కె.ఎస్.రవికుమార్ మూవీలో ఆఫర్ వచ్చింది. అయితే పాయల్ డిమాండ్ విన్న తర్వాత నిర్మాతలకు కళ్లు భైర్లు కమ్మాయట. ఈ మూవీ కోసం ఏకంగా 75లక్షల పారితోషికం డిమాండ్ చేసిందట. మరి ముందు ముందు ఎంత డిమాండ్ చేస్తుంతో చూడాల్సి ఉంది.